సంక్రాంతికే వెంకటేష్-అనిల్ రావిపూడి చిత్రం!

విక్టరీ వెంకటేష్- అపజయమెరుగని అనిల్ రావిపూడి కాంబోలో కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వెంకీ-అనిల్ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఎస్.వి.సి. లో రూపొందుతోన్న 58వ చిత్రమిది. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఉగాది కానుకగా ఈరోజు ఈ చిత్రాన్ని ప్రకటించారు.

‘ఎఫ్ 2, ఎఫ్ 3’లతో ఫుల్ లెన్త్ ఫన్ పంచిన ఈ కాంబో ఈసారి హ్యాట్రిక్ మూవీకోసం ఓ క్రైమ్ సబ్జెక్ట్ తో రాబోతున్నారు. ఈ సినిమాలో ఎక్స్ కాప్ గా కనిపించనున్నాడట వెంకటేష్. అతనికో ఎక్స్ గాళ్ ఫ్రెండ్.. అలాగే ఎక్స్ లెంట్ వైఫ్ ఉంటారట. ఈసారి ఎక్స్ ట్రార్డినరీ ట్రాయంగులర్ క్రైమ్ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తామంటోంది ఈ హిట్ కాంబో. త్వరలో మిగతా డిటెయిల్స్ ను వెల్లడించనున్నారట.

పనిలో పనిగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే సంక్రాంతి బరిలో ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. అంటే.. ఇప్పటికే సంక్రాంతి కానుకగా చిరంజీవి ‘విశ్వంభర’ లైన్లో ఉంది. ఈరోజే ప్రకటించిన రవితేజ-సితార సినిమా కూడా సంక్రాంతికే రాబోతుంది. ఇప్పుడు సంక్రాంతి రేసులో ముచ్చటగా మూడో సినిమా వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబో. మొత్తంమీద.. రాబోయే సంక్రాంతికి రష్ మామూలుగా లేదు.

Related Posts