టాప్ లీగ్ లోకి దూసుకెళ్లిన భీమ్స్ సిసిరోలియో

హీరోలు ఎంతమంది ఉన్నా.. అగ్ర పథంలో దూసుకెళ్లే స్టార్ హీరోలు ఐదారుగురే ఉంటారు. అలాగే.. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నా.. స్టార్ స్టేటస్ దక్కించుకున్న వాళ్లు ఇద్దరు ముగ్గురే. ప్రస్తుతం తెలుగులో అగ్ర పథాన దూసుకెళ్తున్న సంగీత దర్శకులంటే దేవిశ్రీప్రసాద్, తమన్ పేర్లే చెబుతారు. ఇక.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్.కీరవాణి కూడా ఈమధ్య దూకుడు పెంచాడు.

ఇప్పుడు వీళ్లతో పాటు స్టార్ స్టేటస్ దక్కించుకున్న మరో మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ సిసిరోలియో ఎదుగుతున్నాడు. పుష్కర కాలం క్రితం సంగీత దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన భీమ్స్ కి ఈమధ్య వరుస హిట్స్ దక్కుతున్నాయి. ‘ధమాకా, బలగం, మ్యాడ్’ వంటి సినిమాలు భీమ్స్ లోని టాలెంట్ ను బయటపెట్టాయి. దీంతో.. ఇప్పుడు అగ్ర కథానాయకులు ఒక్కొక్కరుగా భీమ్స్ వెంట పడుతున్నారు.

ఇప్పటికే తనతో పలు సినిమాలకు పనిచేసిన భీమ్స్ కి.. మరో ఆఫర్ ఇచ్చాడు రవితేజ. సితారలో రవితేజ చేయబోతున్న సినిమాకి భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక.. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుండే వెంకటేష్ కూడా భీమ్స్ కి కంపోజర్ గా గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. అనిల్ రావిపూడితో వెంకీ చేయబోతున్న సినిమాకి భీమ్స్ సంగీత దర్శకుడిగా సెట్ అయ్యాడు. మరి.. మన టాప్ లీగ్ లో ఉన్న ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ వంటి వారి సినిమాలకు సంగీతాన్నందించే అవకాశం భీమ్స్ కి ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related Posts