కాశీలో మొదలైన సంపత్ నంది-తమన్నా ‘ఓదెల 2‘

డైరెక్టర్ సంపత్ నంది నిర్మాణంలో రూపొందిన ‘ఓదెల రైల్వే స్టేషన్‘కి మంచి పేరొచ్చింది. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. 2022లో డైరెక్ట్ ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఇప్పుడు ‘ఓదెల‘కి సీక్వెల్ తీసుకొస్తున్నాడు సంపత్ నంది. ఈసారి ‘ఓదెల 2‘ని పాన్ ఇండియా లెవెల్ లో తీసుకురాబోతున్నాడు. సీక్వెల్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా ఇప్పటికే ‘రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్‘ వంటి సినిమాల్లో నటించింది. తమన్నా గ్లామర్ ను ఆన్ స్క్రీన్ పై అత్యద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుల్లో సంపత్ నంది ఒకడు. ఇప్పుడు ‘ఓదెల 2‘తో మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతోంది. సంపత్ నంది నిర్మాతగానూ, క్రియేటర్ గానూ వ్యవహరించే ఈ చిత్రానికి.. తొలి భాగాన్ని తీర్చిదిద్దిన అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్, నీతా లుల్లా కాస్ట్యూమ్స్ టెక్నికల్ గా ‘ఓదెల 2‘కి మరింత అడ్వాంటేజ్ కాబోతున్నాయి. ఈరోజు కాశీలో ఈ చిత్రం ప్రారంభమయ్యింది.

Related Posts