చారి 111 రివ్యూ

ప్రజెంట్ జనరేషన్‌ కమెడియన్స్‌లో వెన్నెల కిశోర్ మార్క్‌ వేరు. హీరో కి ధీటుగా సినిమా సక్సెస్‌లో భాగం పంచుకోగల కమెడియన్‌. అలాంటిది వెన్నెల కిశోరే హీరోగా సినిమా రావడం అది కూడా సీక్రెట్ ఏజెంట్ బ్యాక్‌డ్రాప్ కావడం.. ఎంత కామెడీ ఏజెంట్ అనేది ట్రైలర్‌లోనే రివీల్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి.మరి ఆ అంచనాలను చారి 111 మూవీ అందుకుందా లేదా ?

కథ :
మేజర్‌ ప్రసాద్‌ రావు (మురళీ శర్మ) రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీని నడుపుతుంటాడు. దేశం కోసం ఈ ఏజెన్సీ సీక్రెట్‌గా పనిచేస్తుంటుంది. ఇందులో చారి (వెన్నెల కిశోర్ ) పనిచేస్తుంటాడు. హైదరాబాద్ లో సూసైడ్ బాంబ్ అటాక్ కావడం.. ఆ కేసును చారికి అప్పజెప్పడం జరుగుతాయి. ఈ కేసు ను చారి ఎలా డీల్ చేసాడు.. .ఇందులో ఈషా (సంయుక్త విశ్వనాథన్‌) ఎందుకు ఎంటరయ్యింది..చారికి అప్పజెప్పిన మిషన్ పూర్తయ్యిందా అనే అంశాలు తెరమీద చూడాల్సిందే.

కథనం: వెన్నెల కిశోర్‌ కామెడీకే సినిమాలు హిట్ అయిన సందర్భాలెన్నో.. అయితే తాను హీరోగా చేసిన ఈ సినిమాలో నవ్వించడం కంటే నవ్వులపాలయినట్టుగా కనిపిస్తుంది. లాజిక్‌లకు దూరంగా.. ఏదో మేజిక్ చేయాలని చూసి సినిమాను ఎటూ కాకుండా మిగిల్చినట్టుగా అనిపిస్తుంది. జేమ్స్‌బాండ్ తరహా బిల్డప్‌లతో వెన్నెల కిశోర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు అనుకున్నారంతా. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఆఖరికి పది శాతం కూడా రీచ్‌ కాలేదనిపిస్తుంది.

నటీనటులు : వెన్నెల కిశోర్‌ ఖచ్చితంగా గ్రేట్ కమెడియన్‌. అతను హీరోగా ఉన్నా.. కమెడియన్ అయినా ఆశించేది కామెడీనే. కానీ ఆ కామెడీనే ఇందులో మిస్సయింది. ఏ ఒక్క సీన్‌ కూడా అనుకున్నంతగా కామెడీ పండించలేదు.


ఈ సినిమాకు వెన్నెల కిషోర్ హీరోనా, కమెడియనా? అన్నది అర్థం కాదు. సంయుక్త చూడటానికి తెరపై అందంగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగానే చేసింది. మురళీ శర్మ పాత్ర రొటీన్‌గా ఉంటుంది. బ్రహ్మాజీ మధ్యలోనే అంతమయ్యే పాత్ర. సత్య కామెడీ కూడా నవ్వించలేకపోయింది. తాగుబోతు రమేష్ పాత్ర కాస్త ఓవర్‌గా, మరీ సిల్లీగా అనిపించింది. విలన్‌గా పోషించింది ఎవరన్నది కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోయేలా ఉంది. ఏ పాత్ర కూడా ప్రేక్షకులపై ప్రభావం చూపించదు.

Related Posts