సూర్య నటించే పౌరాణిక చిత్రంలో జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళితే.. ఆమె తనయ జాన్వీ కపూర్ ఉత్తరాది నుంచి వచ్చి దక్షణాదిన పాగా వేసే పనిలో ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర‘ చిత్రంలో కథానాయికగా నటిస్తూ.. సౌత్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ‘దేవర‘ తర్వాత మరో సౌత్ సూపర్ స్టార్ తో నటించే ఛాన్స్ అందుకుందట. అతను మరెవరో కాదు.. విలక్షణ నటుడు సూర్య.

సూర్య టైటిల్ రోల్ లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మెహ్రా ‘కర్ణ‘ పేరుతో సినిమాని తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు. హిందీలో ‘రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్‘ వంటి భారీ విజయాలను సొంతం చేసుకున్న క్రెడిట్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మెహ్రా ది. ఇక.. పౌరాణిక ఇతివృత్తంతో కర్ణుడు ప్రధాన పాత్రలో సూర్య ‘కర్ణ‘ తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో సూర్యకి జోడీగా జాన్వీ కపూర్ ని పరిశీలిస్తున్నారట. పురాణాల ప్రకారం కర్ణుడికి వృషాలి, సుప్రియ పేర్లతో ఇద్దరు భార్యలున్నారు. కానీ.. ఇప్పటివరకూ మన పౌరాణిక చిత్రాల్లో కర్ణుడు భార్య పాత్రలను ఎక్కువగా చూపించలేదు. ప్రస్తుతం ‘కంగువ‘ సినిమాతో బిజీగా ఉన్న సూర్య.. ఈ ఏడాది ద్వితియార్థం నుంచి ‘కర్ణ‘ షూటింగ్ లో పాల్గొంటాడట.

Related Posts