టాలీవుడ్

అత్యంత ధనిక అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ బయోగ్రఫీ

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈక్రమంలోనే తమ ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్లు సబ్ మిట్ చేస్తున్నారు. అలా.. గుంటూరు ఎమ్.పి. స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి.

గుంటూరు ఎమ్.పి. గా ఉన్న గల్లా జయదేవ్ కూడా దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరుగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ, వ్యాపార వేత్త గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించి పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో చంద్రశేఖర్‌ను గుంటూరు నుంచి పోటీకి దింపాలని టీడీపీ నిర్ణయించింది.

జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌ పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 22న పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాల్లో ఆస్తిపాస్తుల అఫిడవిట్ కూడా సమర్పించారు. భారీగా వ్యవసాయ భూములు, నివాస భవనాలు, వాణిజ్య సముదాయాలు చంద్రశేఖర్‌తోపాటు ఆయన సతీమణి శ్రీరత్న పేరిట ఉన్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాతోపాటు హైదరాబాద్‌, ఢిల్లీ, అమెరికాలో ఆ దంపతులకు భారీగా స్థిరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తల పేరిట ఉన్న స్థిరాస్తులు విలువనే రూ.వెయ్యి కోట్లకు పైగా ఉంటాయి. వీరి ఆస్తిపాస్తుల చిటటా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తన అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తులు రూ. 5,705 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించారు. అతని అఫిడవిట్ ప్రకారం, ఆధారపడిన కుమారుడు, అభినవ్ పెమ్మసాని రూ. 496.27 కోట్ల చరాస్తులను కలిగి ఉండగా, ఆధారపడిన కుమార్తె సహస్ర పెమ్మసాని రూ. 496.47 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు. కుటుంబానికి ఆఫ్‌షోర్‌లో రూ.16.51 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

2022 క్యాలెండర్ సంవత్సరంలో, ఈ జంట ఉమ్మడి ఆదాయం రూ. 605.57 కోట్లు. అదే 2021లో రూ.643.42 కోట్లు. ఇక.. చంద్ర శేఖర్ రెండు మెర్సిడెస్ బెంజ్, టెస్లా మోడల్ ఎక్స్ మరియు రోల్స్ రాయిస్ ఘోస్ట్ సహా రూ. 6.11 కోట్ల విలువైన ఐదు వాహనాలను కలిగి ఉన్నారు. ఆయనకు రూ.72 కోట్ల చరాస్తులు ఉండగా, ఆయన భార్య ఆస్తుల విలువ రూ.34.82 కోట్లు. ఒక్కొక్కరికి రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయి.

48 ఏళ్ల పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామానికి చెందిన వారు. 1999లో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. తర్వాత అమెరికా వెళ్లి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అతను జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశారు మరియు వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

చంద్ర శేఖర్ 2020లో యుఎస్‌లోని దాదాపు 200 మంది అగ్రశ్రేణి వ్యాపార నాయకులతో పోటీ పడి యువ పారిశ్రామికవేత్తగా ప్రతిష్టాత్మక ఎర్నెస్ట్ అండ్ యంగ్ అవార్డును పొందారు. పెమ్మసాని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా ఉన్నారు, వైద్యంలో ఉన్నత విద్య కోసం భారతదేశం నుండి యుఎస్‌కు వచ్చే విద్యార్థులకు సహాయం చేస్తారు. గుంటూరు, నరసరావుపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి తాగునీటిని సరఫరా చేసే పెమ్మసాని ఫౌండేషన్‌ను కూడా ఆయన స్థాపించారు

.

చంద్రశేఖర్‌ తండ్రి తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నారు. టీడీపీకి ఆర్థికంగా పెమ్మసాని చంద్రశేఖర్‌ అండగా నిలిచారు. ఎన్నారై పరంగా టీడీపీకి భారీ సేవలు అందించారు. ఆ సేవలకు గుర్తింపుగాను తాజా ఎన్నికల్లో గుంటూరు టీడీపీ ఎంపీ టికెట్‌ దక్కింది.

N RENUKA

Recent Posts

Yashika Aannand

14 mins ago

Daksha Nagarkar

19 mins ago

Rashi Singh

24 mins ago

మహేష్-రాజమౌళి మూవీ కాస్టింగ్ డైరెక్టర్ పై క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమా 'ఎస్.ఎస్.ఎమ్.బి.29'. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న…

1 hour ago

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

2 hours ago

Mirnalini Ravi

2 hours ago