మొదలైన రవితేజ-హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్‘

మాస్ మహారాజ రవితేజ.. టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో సినిమాని అనౌన్స్ చేయడంతో పాటు.. లేటెస్ట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఈ చిత్రానికి ‘మిస్టర్ బచ్చన్‘ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. ‘నామ్ తో సునా హోగా‘ అనేది ట్యాగ్ లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీ ఈరోజు పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది.

బాలీవుడ్ లో విజయవంతమైన ‘రెయిడ్‘ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పోస్టర్ ను బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఆ వార్తలకు బలం చేకూర్చినట్టయ్యింది. ఈ మూవీలో రవితేజాకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే నటిస్తుంది. మరోవైపు మలినేని గోపీచంద్ తో నటించాల్సిన సినిమా క్యాన్సిల్ అవ్వడంతో.. ఆ ప్లేసులో ఈ మూవీని సెట్ చేశాడు మాస్ మహారాజ. ఇక.. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొంతకాలం తాత్కాలికంగా ఆగినట్టు తెలుస్తోంది. రవితేజ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ని ఫినిష్ చేయనున్నాడట హరీష్ శంకర్.

Related Posts