అల్లు అర్జున్ ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ కి రెండేళ్లు

2021, డిసెంబర్ 17న విడుదలైన ‘పుష్ప‘ పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ సాధించింది.
సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌ యాక్టింగ్, డైలాగ్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. సినిమా ప్రేక్షకులే కాదు, రాజకీయ నేతలు, క్రీడాకారులు కూడా ఈ సినిమాలోని తగ్గేదేలే డైలాగ్‌తో రచ్చ రచ్చ చేశారు. పుష్ప సినిమాలోని పాటలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఈ సినిమాకి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ జాతీయ అవార్డులు అందుకున్నారు.

జాతీయ అవార్డులతో పాటు.. దాదా సాహెబ్ ఫాల్కే ఇండియన్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్, ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, ఏడు సైమా అవార్డ్స్ ‘పుష్ప‘ చిత్రం దక్కించుకుంది. ఇంకా.. వరల్డ్ వైడ్ గా రూ.356 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ‘పుష్ప పార్ట్ 1‘.. కేవలం హిందీలోనే రూ.108 కోట్లు నెట్ వసూళ్లను కొల్లగొట్టడం మరో విశేషం. డిజిటల్ గానూ ‘పుష్ప‘ సృష్టించిన సెన్సేషన్ మరో లెవెల్. ఈ సినిమా ఆల్బమ్ ఏకంగా 6 బిలియన్ ప్లస్ వ్యూస్ తో ఇండియన్ మూవీస్ లోనే ఓ చరిత్ర సృష్టించింది. ఇన్ స్టా గ్రామ్ లో ఈ సినిమాపై 10 మిలియన్లకు పైగా రీల్స్ వచ్చాయి. ఇంకా.. 2022కి గానూ అమెజాన్ ప్రైమ్ లో మోస్ట్ వ్యూవ్డ్ ఇండియన్ మూవీ గా ‘పుష్ప 1‘ నిలిచింది. మొత్తంమీద.. ‘పుష్ప ది రైజ్‘ సూపర్ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు ‘పుష్ప ది రూల్‘పై అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే యేడాది ఆగస్టు 15న ‘పుష్ప 2‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts