‘నా సామిరంగ‘ టీజర్.. అసలుసిసలు సంక్రాంతి మూవీ

‘సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు‘ సినిమాలతో గడిచిన సంక్రాంతి సీజన్లలో సూపర్ హిట్స్ అందుకున్నాడు కింగ్ నాగార్జున. ఇప్పుడు మళ్లీ సంక్రాంతి కానుకగా ‘నా సామిరంగ‘ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ తో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది టీమ్. రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ అన్ని అంశాలతో ‘నా సామిరంగ‘ చిత్రం రాబోయే సంక్రాంతికి అసలు సిసలు ఎంటర్ టైనర్ గా గా నిలవబోతున్నట్టు అర్థమవుతోంది.

ఈ సినిమాలో నాగార్జునకి జోడీగా ఆషిక రంగనాథ్ నటించింది. ఇతర కీలక పాత్రల్లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్ బిన్ని డైరెక్టర్. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. నాగార్జున-కీరవాణి కాంబినేషన్ లో చాలా సంవత్సరాల తర్వాత రాబోతున్న సినిమా ఇది.

Related Posts