మెగాస్టార్ కోసం విలన్ గా మారుతోన్న రానా

రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్లకుండా.. విలక్షణమైన కథలతో అలరించడానికి ఆసక్తి చూపించే కథానాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందినవాడే రానా దగ్గుబాటి. తన వద్దకి డిఫరెంట్ స్క్రిప్ట్ తో వస్తే ఖచ్చితంగా అగ్రిమెంట్ సైన్ చేసేస్తాడు మన ఆజానుబాహుడు. అందుకే.. ‘బాహుబలి’ లాంటి సినిమాలో ఎలాంటి సంకోచం లేకుండా విలన్ గా మెప్పించగలిగాడు. లేటెస్ట్ గా మరోసారి విలన్ గా మురిపించడానికి సిద్ధమయ్యాడట రానా.

ఈసారి మెగాస్టార్ చిరంజీవి కోసం విలన్ గా మారుతున్నాడట ఈ హ్యాండ్సమ్ హంక్. చిరంజీవి 156వ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా రానా నటించబోతున్నాడట. మార్వెల్ సినిమాటిక్ యూనివర్శ్ లోని ‘లోకి’ క్యారెక్టర్ తరహాలో ఈ చిత్రంలోని రానా పాత్ర కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఇక.. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తుంది.

Related Posts