మరోసారి సుక్కూ డైరెక్షన్‌లో చెర్రీ

చెర్రీని యాక్టర్ గా ప్రూవ్ చేసిన ఘనత సుకుమార్‌కే దక్కుతుంది. అప్పటి దాకా యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న చెర్రీని రంగస్థలంతో అందరూ నోరెళ్లబెట్టేలా పర్‌ఫార్మ్ చేయించాడు సుక్కూ. రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర రూ. 125 కోట్ల షేర్.. రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌లో బిజీగా ఉన్న చెర్రీ.. బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఆర్‌సి 16 చేయబోతున్నాడు. హోలీ సందర్భంగా ఆర్‌సి 17 తో రంగస్థలం కాంబోలో రిపీట్ చేయబోతున్నారు.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన సుకుమార్‌.. ఈ ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రణాళిక రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ అప్‌డేట్ హోళీ తో పాటు చెర్రీ బర్త్‌డే గిఫ్ట్‌ అని ఖుషీ అవుతున్నారు చెర్రీ ఫ్యాన్స్.

Related Posts