‘మోత’ మోగిస్తున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సెకండ్ సింగిల్‌

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ . కృష్ణ చైతన్య రచన దర్శకత్వంలో విశ్వక్‌సేన్ మెయిన్‌లీడ్‌తో రాబోతున్న ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్ కాగా.. అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా నుంచి రిలీజయిన ‘సుట్టంలా సూసి పోకలా’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా నుంచి హోలీ సందర్భంగా మరో పాట రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

‘మోత ‘ అంటూ సాగే సూపర్బ్ సాంగ్ రిలీజ్‌ చేసారు. ఆస్కార్‌ విన్నర్‌ చంద్రబోస్‌ రాయగా.. యవన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ లో ఎంఎం మానసి అద్భుతంగా పాడింది. ఈ పాట యూత్‌ని హుషార్తెత్తించేలా స్వరపరిచారు యువన్ శంకర్‌ రాజా. అయేషా ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఎనర్జీ సినీ ప్రేమికులందరికీ ప్రత్యేక ట్రీట్ లా ఉండనుంది. ఈ చిత్రంలో అందాల నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, ప్రతిభగల నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related Posts