హోలీ సందర్భంగా ‘ధూం ధాం ‘ స్పెషల్ పోస్టర్‌

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “ధూం ధాం” సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లు. సాయికుమార్ మచ్చా డైరెక్షన్‌లో ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ లు నిర్మిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ చిత్ర షూటింగ్ ఆఖరి దశలో ఉంది. సమ్మర్‌లో రిలీజ్‌ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. హోలీ పండుగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్తూ ఈ చిత్రం నుంచి స్పెషల్‌ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఫారిన్ లొకేషన్ లో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ను ఈ పోస్టర్ లో రివీల్ చేశారు.

Related Posts