HomeMoviesటాలీవుడ్నితిన్ సినిమాలో రాజశేఖర్?

నితిన్ సినిమాలో రాజశేఖర్?

-

తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా హీరోలుగా కొనసాగుతున్న అతికొద్ది మందిలో రాజశేఖర్ ఒకరు.
ఒకప్పుడు అతని ఆవేశం చూసి వెండితెర కూడా ఊగిపోయింది. అతను చేసిన అంకుశం ఎంతో మంది హీరోలకు నిద్రలేకుండా.. తర్వాత వాళ్లూ అలాంటి పాత్రలే చేయాలనే కలలు కనేలా చేసింది. ఆవేశానికి మారుపేరుగా నిలిచినా.. సెంటిమెంట్ ను పండించడంలో తన మార్క్ చూపించినా.. అది రాజశేఖర్ కే సొంతం.

ఇండస్ట్రీకొచ్చి నలభైయేళ్లవుతోన్నా.. ఇంకా హీరో పాత్రలకే ఫిక్సయ్యాడు రాజశేఖర్. అదే ఈ యాంగ్రీమ్యాన్ కెరీర్ కు మైనస్ గా మారింది. అతను ఒక్కసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాలనుకుంటే చాలు.. ఎంతో మంది దర్శకనిర్మాతలు సరికొత్త పాత్రలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో రామ్ చరణ్ ‘ధృవ‘ సినిమాకోసం అరవింద్ స్వామి పాత్రకు ముందుగా రాజశేఖర్ నే అనుకున్నారు. కానీ.. రాజశేఖర్ ఆ రోల్ చేయడానికి ఒప్పుకోలేదు. మరోవైపు హీరోగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడంలేదు.

లేటైనా లేటెస్ట్ గా మంచి నిర్ణయం తీసుకున్నాడట రాజశేఖర్. ఇకపై మనసుకి నచ్చిన క్యారెక్టర్ రోల్స్ చేయడానికి సై అంటున్నాడట. నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‘లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. అందుకు సంబంధించిన షూట్ కూడా మొదలవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ సినిమాతో పాటు.. మరో రెండు మూడు సినిమాలలోనూ క్యారెక్టర్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట యాంగ్రీ మ్యాన్.

ఇవీ చదవండి

English News