సమ్ థింగ్ స్పెషల్ గా ‘స్కార్క్‘ ట్రైలర్

విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోహీరోయిన్లుగా రాబోతున్న రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘స్పార్క్’. గత కొన్ని రోజులుగా ఈ సినిమా పాటలు యూట్యూబ్ ని ఊపేస్తున్నాయి. లావిష్ లొకేషన్స్ లో అద్భుతమైన విజువల్స్ తో రూపొందిన ‘స్పార్క్‘ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ‘ఖుషి‘ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక.. ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా.. స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్ గా తన టాలెంట్ చూపించబోతున్నాడు విక్రాంత్. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.

‘స్పార్క్‘.. ‘లైఫ్‘ అనే ట్యాగ్ లైన్ తో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంది. ట్రైలర్ ప్రారంభంలో హీరో విక్రాంత్.. హీరోయిన్లు మెహరీన్, రుక్సార్ లతో లవ్ ట్రయాంగిల్ నడిపిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్స్ అన్నీ క్రైమ్ మోడ్ లోకి మారిపోయాయి. హీరో కొడవలి పట్టుకుని వరుస హత్యలు చేయడం.. మధ్యలో పోలీసాఫీసర్ గా బ్రహ్మాజీ ఎంట్రీ.. ఇలా ట్రైలర్ చూస్తుంటే.. కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా.. హీరో ఏదో ఇంటెన్షన్ తో వరుస హత్యలు చేస్తున్నాడని అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, సత్య వంటి కమెడియన్స్ కూడా ఈ మూవీలో ఉన్నారు. ఓవరాల్ గా ట్రైలర్ తో మంచి మార్కులు వేయించుకున్న ‘స్పార్క్‘ మూవీ నవంబర్ 17న థియేటర్లలోకి రాబోతుంది.

Related Posts