మరికొద్దిసేపట్లో ‘పుష్ప 2’ ప్రభంజనం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ఈరోజు ఉదయం 11.07 నిమిషాల‌కు పుష్ప 2 టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన ఓ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. ఈ స్టిల్‌లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు.

మరోవైపు టీజర్ రెస్పాన్స్ కోసం బన్నీ మాత్రమే కాదు.. మరికొంతమంది నటులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్లే ఫహాద్ ఫాసిల్, బ్రహ్మాజీ, సునీల్, అనసూయ. వీరంతా కలిసి తమ కెప్టెన్ ఆఫ్ ది మూవీ సుకుమార్ తో సందడి చేస్తున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి.. మరికొద్దిసేపట్లో విడుదలయ్యే ‘పుష్ప 2’ టీజర్ ప్రభంజనం ఏ రేంజులో ఉంటుందో.

Related Posts