అఖిల్ కొత్త సినిమాపై క్లారిటీ వచ్చేనా?

సరైన విజయాలైతే దక్కలేదు కానీ.. అక్కినేని అఖిల్ టాలెంట్ ను తక్కువ చేయడానికి ఏమీ లేదు. ఈతరం హీరోలకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ పుష్కలంగా ఉన్న నటుడు అఖిల్. సినిమా సినిమాకీ తన మేకోవర్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నా.. కథల ఎంపికలో మాత్రం తడబడుతూనే ఉన్నాడు. ఫలితంగా సరైన హిట్ పడటం లేదు. హీరోగా కెరీర్ మొదలుపెట్టి తొమ్మిదేళ్లవుతున్నా.. సినిమాల సంఖ్య మాత్రం కేవలం ఐదంటే ఐదే.

‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత అఖిల్ ఏ సినిమా చేయబోతున్నాడు? ఎవరితో వర్క్ చేస్తాడు? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ‘ఏజెంట్’ విడుదలై ఏడాది అవుతున్నా కొత్త సినిమాపై ఎలాంటి కన్ఫమేషన్ ఇవ్వలేదు ఈ అక్కినేని వారబ్బాయి. ఈరోజు (ఏప్రిల్ 8) అఖిల్ పుట్టినరోజు. మరి.. ఈ సందర్భంగా అఖిల్ న్యూ మూవీపై ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

Related Posts