టివి5 మూర్తి.. ఈ ప్రతినిధిని నిలబెడతాడా

నారా రోహిత్.. ఒకప్పుడు ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నాడు. వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కథల్లోని వైవిధ్యం కథనంలో కనిపించక వరుసగా అనేక ఫ్లాపులు చూశాడు. స్వయంగా నిర్మాతగానూ కొన్ని సినిమాలు చేశాడు. అవీ పోయాయి. దీంతో సడెన్ గా పరిశ్రమ నుంచి తప్పుకున్నాడు.

అతను రాజకీయాల్లోకి వెళతాడు అనుకున్నారు చాలామంది. బట్ చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఒకప్పుడు తనే చేసిన ప్రతినిధి అనే సినిమాకు కొనసాగింపుగా కొత్త కథ, కొత్త టీమ్ తో ప్రతినిధి2 అనే సినిమాతో రాబోతున్నాడు. లేటెస్ట్ గా తన బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సామాజిక, మీడియా వ్యవహారాలను ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నారు అనేది తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి సీనియర్ జర్నలిస్ట్ ఏ ఛానల్ లో పనిచేస్తే ఆ ఛానల్ ను ఇంటిపేరుగా మార్చుకునే టివి5 మూర్తి దర్శకుడు కావడం విశేషం.పొలిటికల్ జర్నలిస్ట్ గా కనిపించినా.. మూర్తిలో సినిమాకు సంబంధించిన అవగాహన కూడా బాగానే ఉందని ఆయనతో పరిచయం ఉన్నవారికి తెలుసు. ఆ మధ్య ప్లే బ్యాక్ అనే సినిమాలో తను విలన్ గా నటించాడు కూడా.

ఆ అనుభవంతో పాటు సినిమా వారితోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే ఇవన్నీ వ్యక్తిగతమే. సినిమాకు వస్తే మేకింగ్ లో పట్టు ఉండాలి. అయితే మూర్తి వీడియో ఎడిటింగ్ కూడా చేయగలడు. దీంతో షాట్ డివిజన్ పై పూర్తి అవగాహన ఉంటుంది. ఇక ఇతర అంశాలు సీనియర్ కో డైరెక్టర్స్ ను పెట్టుకుంటే అయిపోతుంది. మరో విశేషం ఏంటంటే ఈ కథ కూడా ఆయనే రాసుకున్నాడు. అంటే బలమైన పాయింట్స్ నే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.


ప్రతినిధి విజయం సాధించినా.. ఎక్కువ భాగం రోహిత్ కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడంతో సాగుతుంది. పాయింట్ బావుండటం వల్ల ఈ మైనస్ కొట్టుకుపోయింది కానీ లేదంటే అదే సినిమాకు పెద్ద మైనస్ అయ్యేది. ఈ సారి అలాంటి మిస్టేక్స్ లేకుండా మూర్తి దర్శకత్వంలో వస్తోన్న ఈ ప్రతినిధి2తో నారా రోహిత్ మళ్లీ నిలబడతాడేమో చూడాలి.

Related Posts