రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా ఆరోజే ప్రారంభం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందే సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సినిమాకోసం చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ ని ఖరారు చేశారు. ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. మరో ముఖ్య పాత్రలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కనిపించనున్నాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఆ ప్రాంతం నుంచి చాలామందినే నటీనటులుగా ఎంపిక చేశారు.

అన్నీ బాగానే ఉన్నాయి. అయితే.. అసలు ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది.. ఎప్పటి నుంచి పట్టాలెక్కుతుంది అనేదానిపైనే అందరి ఆసక్తి. ఇప్పుడా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఈనెల 20న రామ్ చరణ్ 16వ సినిమా ముహూర్తాన్ని జరుపుకోనుందట. ఈ మూవీ ఓపెనింగ్ సెరమనీని చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నాయట నిర్మాణ సంస్థలు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Related Posts