టాలీవుడ్

పెదకాపు 1.. ఆ ఊరికి రెండే దిక్కులు

ఇది సినీవర్స్ ల కాలం. ఒకప్పుడు సీక్వెల్స్ అన్నారు. ఇప్పుడు సినీవర్స్ అంటున్నారు. అంటే రెండు మూడు కథలను కలిపి చివర్లో ఒకే కథగా చూపడం అన్నమాట. అలాంటివి యాక్షన్ ఓరియంటెడ్ గానే ఇప్పటి వరకూ వచ్చాయి. బట్ రూరల్ బ్యాక్ డ్రాప్ లోనూ చూపిస్తానంటూ రాబోతున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పటి వరకూ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను మాత్రమే తీసిన శ్రీకాంత్ ఫస్ట్ టైమ్ ఎవరూ ఊహించని జానర్ లోకి ఎంటర్ అవుతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ‘పెదకాపు -1’ అనే సినిమాతో వస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ పెదకాపు1 టీజర్ విడుదలైంది.


శ్రీకాంత్ అడ్డాల అనగానే ఆడియన్స్ లో ఓ లెక్క ఉంది. బట్ ఆ లెక్కలను పూర్తిగా మార్చేసినట్టుగా ఉంది ఈ టీజర్. ఈ చిత్రాన్ని మూడు నాలుగు భాగాలుగా రూపొందించబోతున్నారని గతంలోనే అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఫస్ట్ పార్ట్ .. నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో స్టార్ట్ అయినట్టుగా మొదలైంది. అప్పటికే హీరో కుర్రాడు. అంటే థర్డ్ పార్ట్ కు వచ్చేసరికి అతని వయసు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.


పార్టీ స్థాపించిన కొత్తలో జరిగిన ఓ మీటింగ్ లో ఎన్టీఆర్ మాట్లాడుతన్న డైలాగ్స్ తోమొదలైంది టీజర్. ఆ ఊరికి బొడ్రాయి స్థాపించే క్రమంలో రూపొందించే ధ్వజ స్తంభాన్ని ఊరి యువత తీసుకువస్తున్నట్టుగా విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇదే క్రమంలో కనిపించిన సామూహిక ఖననం సీన్ అదిరిపోయింది. ” ఏ ఊరికైనా నాలుగు దిక్కులుంటయ్.. కానీ ఈ ఊరికి రెండే దిక్కులు.. ఒకటి సత్య రంగయ్య, రెండో వాడు బయన్న.. ఎవడైనా సరే.. ఈ రెండు దిక్కుల్లో పడి చావాల్సిందే.. ” అన్న తనికెళ్ల భరణి డైలాగ్.. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను చూపిస్తుంది. అంటే పెదకాపు1 లో హీరో మరో దిక్కును క్రియేట్ చేస్తాడు. అంటే తనే ఓ రాజకీయ శక్తిగా ఎదుగుతాడు అని సులభంగానే ఊహించుకోవచ్చు. టైటిల్ లో కులం పేరు కనిపిస్తున్నా.. ఇది కొందరి ఆధిపత్యాన్ని ప్రశ్నించే సినిమాలా కనిపిస్తోంది.


ఇక టీజర్ చూశాక శ్రీకాంత్ అడ్డాలలో ఇంత ఫైర్ ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. అవుట్ స్టాండింగ్ విజువల్స్ ఉన్నాయి. ఈ రేంజ్ మేకింగ్ శ్రీకాంత్ సినిమాల్లో ఇప్పటి వరకూ కనిపించలేదు. మామూలుగా తను ముకుంద సినిమాలో ఓ పొలిటికల్ యాంగిల్ ను టచ్ చేశాడు. బట్ ఈ సారి అది నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందని ఈ టీజర్ తోనే తేలిపోయింది. శ్రీకాంత్ తర్వాత ఆశ్చర్యపరిచింది మిక్కీ జే మేయర్ సంగీతం. ఇప్పటి వరకూ సాఫ్ట్ సాంగ్స్ కే పరిమితమైన అతనికి ఓ మంచి అవకాశం వచ్చినట్టుంది. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కనిపిస్తోంది.


ఇక శ్రీకాంత్ ప్రతి సినిమాలో కనిపించే రావు రమేష్‌ ఇందులో ఓ ప్రధానమైన పాత్ర చేస్తున్నట్టున్నాడు. అతనితో పాటు తమిళ్ నటుడు నరేన్ రైవల్రీగా ఉన్నాడు. ఈ చిత్రంతో విరాట్ కర్ణన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్. రావు రమేష్‌, నాగబాబు, అనసూయ, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మొత్తంగా ఈ పెదకాపు 1 టీజర్ చూస్తోంటే ఓ ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాను చూడబోతున్నాం అనేలానే ఉంది. మరి సినిమాగా ఎలా ఉంటుందో చూడాలి.

Telugu 70mm

Recent Posts

NehaSolanki

46 seconds ago

Varsha Bollamma

17 mins ago

Eesha Rebba

21 mins ago

ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పడేసిన ప్రభాస్ పోస్ట్

రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకి చాలా లేటుగా ఎంటరయ్యాడు. పైగా ప్రభాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అరుదుగా ఉంటాయి.…

48 mins ago

హైకోర్టుకు చేరిన ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం

జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని…

5 hours ago