పెదకాపు 1.. ఆ ఊరికి రెండే దిక్కులు

ఇది సినీవర్స్ ల కాలం. ఒకప్పుడు సీక్వెల్స్ అన్నారు. ఇప్పుడు సినీవర్స్ అంటున్నారు. అంటే రెండు మూడు కథలను కలిపి చివర్లో ఒకే కథగా చూపడం అన్నమాట. అలాంటివి యాక్షన్ ఓరియంటెడ్ గానే ఇప్పటి వరకూ వచ్చాయి. బట్ రూరల్ బ్యాక్ డ్రాప్ లోనూ చూపిస్తానంటూ రాబోతున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పటి వరకూ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను మాత్రమే తీసిన శ్రీకాంత్ ఫస్ట్ టైమ్ ఎవరూ ఊహించని జానర్ లోకి ఎంటర్ అవుతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ‘పెదకాపు -1’ అనే సినిమాతో వస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ పెదకాపు1 టీజర్ విడుదలైంది.


శ్రీకాంత్ అడ్డాల అనగానే ఆడియన్స్ లో ఓ లెక్క ఉంది. బట్ ఆ లెక్కలను పూర్తిగా మార్చేసినట్టుగా ఉంది ఈ టీజర్. ఈ చిత్రాన్ని మూడు నాలుగు భాగాలుగా రూపొందించబోతున్నారని గతంలోనే అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఫస్ట్ పార్ట్ .. నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో స్టార్ట్ అయినట్టుగా మొదలైంది. అప్పటికే హీరో కుర్రాడు. అంటే థర్డ్ పార్ట్ కు వచ్చేసరికి అతని వయసు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.


పార్టీ స్థాపించిన కొత్తలో జరిగిన ఓ మీటింగ్ లో ఎన్టీఆర్ మాట్లాడుతన్న డైలాగ్స్ తోమొదలైంది టీజర్. ఆ ఊరికి బొడ్రాయి స్థాపించే క్రమంలో రూపొందించే ధ్వజ స్తంభాన్ని ఊరి యువత తీసుకువస్తున్నట్టుగా విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇదే క్రమంలో కనిపించిన సామూహిక ఖననం సీన్ అదిరిపోయింది. ” ఏ ఊరికైనా నాలుగు దిక్కులుంటయ్.. కానీ ఈ ఊరికి రెండే దిక్కులు.. ఒకటి సత్య రంగయ్య, రెండో వాడు బయన్న.. ఎవడైనా సరే.. ఈ రెండు దిక్కుల్లో పడి చావాల్సిందే.. ” అన్న తనికెళ్ల భరణి డైలాగ్.. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను చూపిస్తుంది. అంటే పెదకాపు1 లో హీరో మరో దిక్కును క్రియేట్ చేస్తాడు. అంటే తనే ఓ రాజకీయ శక్తిగా ఎదుగుతాడు అని సులభంగానే ఊహించుకోవచ్చు. టైటిల్ లో కులం పేరు కనిపి�