పొలిమేర.. ఏ అంచనాలు లేకుండా వచ్చిన సినిమా. అప్పట్లో ఓటిటిలో స్ట్రీమ్ అయితే కేవలం మౌత్ టాక్ తోనే స్ప్రెడ్ అయింది. అనూహ్యంగా చూసిన ప్రతి ఒక్కరూ సూపర్ అన్నారు. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కు షాక్ అయ్యారనే చెప్పాలి. ఇప్పటి వరకూ వచ్చిన బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలోని సినిమాలకు పూర్తి భిన్నంగా అత్యంత సహజంగా ఈ చిత్రంలోని ఆ సన్నివేశాలు ఆకట్టున్నాయి.
ప్రధానంగా గ్రామీణ నేపథ్యం ఉన్న ఆడియన్స్ కు ఈ మూవీలోని చేతబడి సన్నివేశాలు వందశాతం నచ్చేలా ఉన్నాయనే చెప్పాలి. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శ్రీను తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సెకండ్ పార్ట్ పైనా అంతే ఆసక్తిని పెంచుతూ ముగించాడు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్.
పొలిమేర వచ్చి చాలా రోజులు అయింది. అప్పటి నుంచి ఈ చిత్రం సీక్వెల్ కోసం చాలమంది ఎదురుచూస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా డిస్కషన్స్ నడిచాయి. బాగా లేట్ అయింది. దీంతో ఇంక రాదు అనుకున్నారు. బట్ సడెన్ గా పొలిమేర2 టీజర్ తో వచ్చేసింది టీమ్. ఈ టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ పార్ట్ పై ఉన్న ఆసక్తిని కంటిన్యూ చేసేలా ఉంది టీజర్. ఈ సారి మరికొన్ని కొత్త పాత్రలు యాడ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. అలాగే బడ్జెట్ కూడా పెంచినట్టు కనిపిస్తోంది.
దీంతో పాటు గత పార్ట్ లోని పాత్రలను కంటిన్యూ చేస్తూ కొత్త ట్విస్ట్ లకు రంగం సిద్ధం చేశారనిపిస్తోంది. అయితే ఈ టీజర్ లో ఎక్కడా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో బిగ్ ట్విస్ట్ కు కారణమైన రమ్య పొందూరి కనిపించలేదు. అంటే ఈ సారి ఆమె పాత్రతో మరో పెద్ద ట్విస్ట్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అనిపిస్తోంది.
ఇక టీజర్ చివర్లో వచ్చిన డైలాగ్ చూస్తే ఈ సినిమా కంటెంట్ ఈ సారి ఇంకెలా ఉంటుందో అర్థమౌతుంది. “పాణం తీసుడు తప్పు కాదా మామా అని ఓ లేడీ అంటే.. ” పాణం తీస్తే తప్పుగానీ.. బలిస్తే తప్పేందీ.” అంటూ వచ్చే డైలాగ్ చూస్తే ఈ సారి చేతబడిని మించి నరబలులు కూడా ఉంటాయనుకోవచ్చు. ఏదేమైనా పొలిమేర చూసి అభిమానించిన వాళ్లంతా ఈ సెకండ్ పార్ట్ కోసం ఈగర్ గా చూస్తున్నారు. మరి ఈ సారి కూడా వారిని కంప్లీట్ గా ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…
Man of masses NTR's birthday.. Only two more days left. He is acting as Young…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…