చంద్రబాబు కోసం జైలుకు పవన్ కళ్యాణ్

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అక్రమమని వివిధ వర్గాల ప్రజలు ఆయనకు మద్ధతుగా నిలబడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకూ ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.

ఏసిబి కోర్ట్ చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ ఇప్పటికే ఐదు రోజులవుతోంది. ఇక జైల్లో చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ కూడా వెళ్లబోతున్నారు.

ఈ రోజు(గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు జైల్లో ములాఖత్ కానున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నాడు. అటు బాలయ్యతో పాటు లోకేష్ కూడా మధ్యాహ్నం వరకూ జైలుకు వెళ్లబోతున్నారు.


ఇక ములాఖత్ సమయంలో చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ లు రాష్ట్ర పరిస్థితులు మారిన రాజకీయ సమీకరణాల గురించిన కీలకమైన అంశాలను చర్చించబోతున్నారు. ఓ రకంగా ఈ అరెస్ట్ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఓ కసిని నింపింది.

వారితో పాటు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా చంద్రబాబుపై సానుభూతిని చూపిస్తున్నారు. ఈ వివరాలన్నీ చంద్రబాబుతో వారుమాట్లాడబోతున్నారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ కోసం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Posts