రజినీకాంత్ తో రానా..

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ బ్లాక్ బస్టర్ తర్వాత దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే అతని లైనప్ లో రెండు సినిమాలుననాయి. రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ తో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఈ చిత్రాన్ని జైలర్ నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.

దీనికి ముందు తన కూతురు సౌందర్య దర్శకత్వంలో లాల్ సలామ్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే జై భీమ్ దర్శకుడు టిజి జ్ఞానవేల్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు అనే ప్రచారం ఉంది. అలాగే రెండున్నర దశాబ్దాల తర్వాత అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్రంలో రజినీతో కలిసి నటించబోతున్నాడు.


టిజి జ్ఞానవేల్ రాజా చిత్రంలో రజినీకాంత్ కు సపోర్టర్ గా ఓ కీలక పాత్రలో నానిని తీసుకోవాలనుకున్నారు. ఆ పాత్ర చివర్లో నెగెటివ్ టచ్ ఇస్తుందట. అందుకే ముందు ఒప్పుకున్నా తర్వాత తప్పుకున్నాడు నాని. తర్వాత ఆ క్యారెక్టర్ ను శర్వానంద్ తో చేయించాలనుకున్నారు. శర్వాకు తమిళ్ లో కూడా కొంత పాజిటివ్ ఇమేజ్ ఉంది. అయినా అతను ఒప్పుకున్నాడుఅన్నారు.

లేటెస్ట్ గా ఈ సినిమాలోకి రానా ఎంటర్ అయ్యాడు. యస్.. రానా కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర చేయబోతున్నాడని చెన్నై టాక్. అయితే రానా వేరే పాత్ర చేస్తున్నాడా లేక శర్వానంద్ కూడా తప్పుకుంటే ఆ పాత్ర చేస్తున్నాడా అనేది తెలియదు కానీ.. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లు నటిస్తోన్న ఈ చిత్రంలో రానా కూడా నటించబోతున్నాడు అనేది క్లియర్ అంటున్నారు.

Related Posts