నేడే చెక్కుల పంపిణి

ఖుషీ సినిమా బ్లాక్ బస్టర్(..?) అయింది కాబట్టి ఆ ఆనందాన్ని తన అభిమానులతో కలిసి పంచుకోవాలనుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా నిజానికి తెలుగులో అనుకున్నంత పెద్ద హిట్ కాదు. కేవలం నైజాంలో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది. మిగతా అన్ని ఏరియాల్లోనూ ఫ్లాప్ అనిపించుకుంది.

అయితే ఓవర్శీస్ లో మాత్రం బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఆల్రెడీ ఒన్ మిలియన్ క్లబ్ దాటి టూ మిలియన్ క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. అయినా విజయ్ దేవరకొండ గత నాలుగు సినిమాలూ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటేఈ మూవీ మాత్రం కంటెంట్ పరంగా అబౌ యావరేజ్ అనిపించుకుంది.

అందుకే ఆ మాత్రం సంతోషాన్ని అయినా మిగిల్చిందని తన సినిమా రెమ్యూనరేషన్ నుంచి ఒక కోటి రూపాయలను ప్రేక్షకులను ఇవ్వాలనుకున్నాడు. ఇందుకోసం ఒక వంద మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పంచబోతున్నాడు.


ఇక ఈ లక్ష కోసం ఎలా అప్లై చేసుకోవాలనేది గతంలోనే ఓ ఫామ్ ఇచ్చాడు. సోషల్ మీడియా ద్వారా ఆ ఫామ్ అందరికీ చేరింది. మరి ఉచితంగా లక్ష రూపాయాలు వస్తున్నాయంటే ఊరుకుంటారా ఇప్పటికే లక్షల్లో అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి. అందులో నుంచి ఒక వందమందిని మాత్రమే ఎంపిక చేయడం అంటే పెద్ద సవాలే.

ఆ సవాల్ ను దాటుకుని విజయ్ దేవరకొండ టీమ్ ఒక వంద మందిని సెలెక్ట్ చేసుకుంది. వారికి ఇవాళే(గురువారం) ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్ ను అందించబోతున్నారు. మరి ఈ కార్యక్రమంలో విజయ్ కూడా ఉంటాడా లేదా అనేది తెలియదు కానీ ఇవాళ మాత్రం చెక్కుల దినోత్సవం.

Related Posts