పారితోషికాలలో సెంచరీలు కొట్టేస్తున్న మన స్టార్స్

ఒకప్పుడు మన హీరోల రెమ్యునరేషన్స్ రూ.15 నుంచి రూ.20 కోట్లు వరకూ ఉంటే చాలా ఎక్కువ అనుకునే వాళ్లం. ఆ తర్వాత ‘బాహుబలి’ రావడం.. ప్రభాస్ పారితోషికానికి ఒక్కసారిగా రెక్కలు రావడం జరిగింది. దీంతో.. తెలుగు నుంచి తొలిసారిగా వంద కోట్లు అందుకునే హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతం అయితే ‘కల్కి’ సినిమాకి గానూ ప్రభాస్ ఏకంగా రూ.200 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది.

రెబెల్ స్టార్ ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే మాస్ ఫాలోయింగ్ ఉన్న మరో హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ‘పుష్ప’తో తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న బన్నీ.. ‘పుష్ప 2’ కోసం కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఈ సినిమాకోసం అల్లు అర్జున్ కి దాదాపు రూ.150 కోట్లు ముట్టజెబుతున్నారట మేకర్స్.

అంతకుముందు మెగాపవర్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ గా మార్చింది ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం. ఈ సినిమా తర్వాత చరణ్ రెమ్యునరేషన్ కి రెక్కలొచ్చాయి. అప్ కమింగ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం చెర్రీ ఏకంగా రూ.130 కోట్లు తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇది పారితోషికం రూపంలో కావొచ్చు.. కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లేదా నాన్ థియేట్రిల్ రైట్స్ కూడా ఉండొచ్చు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’తో బిజీగా ఉన్నాడు. ‘దేవర’ చిత్రం ఎలాగూ సొంత నిర్మాణ సంస్థలోనే రూపొందుతోంది. అయితే.. బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2’ కోసం తారక్ ఏకంగా రూ.120 కోట్లు అందుకుంటున్నాడనేది ఫిల్మ్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోన్న న్యూస్. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ‘వార్ 2’ షూట్ లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు. పైన మనం చెప్పుకున్న అందరికంటే కాస్త ఆలస్యంగా పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తోన్న మహేష్.. రాజమౌళితో చేయబోతున్న సినిమాకోసం రూ.100 కోట్లు పారితోషికాన్ని పుచ్చుకోనున్నాడట. ఈ సినిమాకోసం దర్శకధీరుడు రాజమౌళి కూడా భారీ లెవెల్ లో పారితోషికాన్ని అందుకోనున్నాడట. మొత్తంమీద.. మన టాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్స్ కోటలు దాటుతున్నాయి. పారితోషికాలలో మనోళ్లు సెంచరీలు కొట్టేస్తున్నారు.

Related Posts