సేఫ్ జోన్ లో ‘ఆపరేషన్ వాలెంటైన్’

వరుణ్ తేజ్ నటించిన ఏరియల్ యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. వరల్డ్ వైడ్ గా భారీ స్క్రీన్స్ లో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ చూడని నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ అందించే చిత్రంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఉండబోతుందని చిత్రబృందం చెబుతూనే ఉంది. మరికొద్ది సేపట్లో ఈ సినిమా రివ్యూస్ బయటకు రానున్నాయి.

అయితే.. అసలు ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా బడ్జెట్ ఎంత? థియేట్రికల్ టార్గెట్ ఎంత? నాన్ థియేట్రికల్ గా వచ్చిందెంత? ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ సేఫేనా? అనే లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్కులేట్ అవుతున్నాయి. వాటి ప్రకారం విడుదలకు ముందే ‘ఆపరేషన్ వాలెంటైన్’ సేఫ్ జోన్ లో ఉందట. ఈ సినిమాని రూ.40 నుంచి రూ.50 కోట్ల బడ్జెట్ తో రూపొందించారట. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం రూ.40 కోట్లు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.26 కోట్లకు దక్కించుకుందట. హిందీ నాన్-థియేట్రికల్ రూ.14 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. మ్యూజిక్ రైట్స్ రూపంలో రూ.2.6 కోట్లు, శాటిలైట్ రూపంలో రూ.6.5 కోట్లు ‘ఆపరేషన్ వాలెంటైన్’కి దక్కాయట. ఇక.. కేవలం రూ.17 కోట్లు మాత్రమే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. అంటే.. ఇప్పుడు థియేట్రికల్ గా ‘ఆపరేషన్ వాలెంటైన్’ టార్గెట్ రూ.17 కోట్లు మాత్రమే. మొత్తంమీద.. విడుదలకు ముందే రూ.67 కోట్లు బిజినెస్ చేసి పూర్తిస్థాయిలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది.

Related Posts