ఓం భీమ్‌ బుష్ గ్రాండ్ ట్రైలర్‌ లాంచ్‌.

ఓం భీమ్‌ బుష్.. టైటిల్ ఎంత ఫన్నీగా ఉందో.. రిలీజైన టీజర్ అంతలా నవ్వించింది. క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. శ్రీ హర్ష కొనుగంటి డైరెక్షన్‌లో వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయ్యింది.


హుషారుతో అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో పాటు యూత్‌ పల్స్ కు తగ్గట్టు ఎంటర్‌టైన్ చేయడంలో శ్రీ హర్ష దిట్ట అనిపించుకున్నాడు. ఇప్పుడు ఓం భీమ్‌ బుష్ తో అంతకుమించి మ్యాజిక్ చేయబోతున్నాడు. రాజ్‌ తోట కెమెరా వర్క్, వి సెల్యూలాయిడ్ టెక్నికల్ వేల్యూస్ ఈ సినిమాని ఉన్నతంగా నిలిపాయి. ఇక శ్రీ విష్ణు మరోసారి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు జాతిరత్నాలకు మించి అనేలా ఎంటర్‌టైన్ చేసారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.


ఈ థియేట్రికల్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్ సినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు

Related Posts