వైజాగ్ లో రామ్ చరణ్ మెగా సందడి

మెగా హీరోలు వరుసగా వైజాగ్ కి క్యూ కడుతున్నారు. మొన్న ‘పుష్ప 2’ షూటింగ్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో చేసిన సందడి గురించి చూశాం. వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి బన్నీ చేరుకున్న హోటల్ వరకూ అభిమానుల చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. లేటెస్ట్ గా ‘గేమ్ ఛేంజర్’ కోసం వైజాగ్ లో సందడి చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.

వైజాగ్ ఎయిర్ పోర్టులో దిగగానే మెగా ఫ్యాన్స్ చరణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత బీచ్ ఒడ్డున భారీ బహిరంగ సభకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. అక్కడ కూడా ఇసుక వేస్తే రాలనంత జనం షూటింగ్ లొకేషన్ ని చుట్టు ముట్టారు. లొకేషన్ నుంచి కొన్ని వీడియోలు, పిక్స్ కూడా నెట్టింట లీకయ్యాయి. మొత్తంమీద.. ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ లుక్ లో చరణ్ అయితే కేక అని చెప్పాలి.

https://twitter.com/RaghuCharanism7/status/1768695208504603096

మార్చి 20 వరకూ వైజాగ్ లో షూటింగ్ పూర్తిచేసి.. ఆ తర్వాత హైదరాబాద్ లో బుచ్చిబాబు సినిమా ఓపెనింగ్ లో పాల్గొంటాడట చరణ్. RC16 చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక.. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ స్పెషల్ గా ‘గేమ్ ఛేంజర్’ నుంచి మోస్ట్ అవైటింగ్ ‘జరగండి జరగండి’ సాంగ్ రాబోతుంది

Related Posts