ఎన్టీఆర్, ప్రభాస్, పవన్.. షూటింగ్ క్యాలెండర్ ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరూ ఒకటికి మించిన సినిమాలను లైన్లో పెట్టారు. మరి.. ప్రస్తుతం మన అగ్ర కథానాయకుల్లో ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి షూటింగ్ విశేషాలు ఏంటి? వారి సినిమాల ఆర్డర్ ఏంటి? ఏ ఏ సినిమాలు ఎంతవరకూ పూర్తయ్యాయి? వంటి విశేషాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.

ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికొస్తే.. తారక్ ప్రస్తుతం ‘దేవర 1’తో బిజీగా ఉన్నాడు. మే లేదా జూన్ చివరి వరకూ ‘దేవర 1’ పూర్తికానుందట. అక్టోబర్ లో దసరా కానుకగా ‘దేవర 1’ విడుదలకు ముస్తాబవుతోంది. ఇక.. ఈ నెల చివరి నుంచి ‘వార్ 2’ సెట్స్ లో జాయిన్ కానున్న ఎన్టీఆర్.. ఆ సినిమాకోసం 55 నుంచి 60 రోజులు కేటాయించాడట. ఇప్పటికే ‘వార్ 2’ షూట్ లో మరో హీరో హృతిక్ రోషన్ పాల్గొంటున్నాడు. 2025, ఆగస్టు 14న ‘వార్ 2’ విడుదలకు ముస్తాబవుతోంది.

‘దేవర 1, వార్ 2’ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు ఎన్టీఆర్. అయితే.. ప్రభాస్ తో ‘సలార్ 2’ పూర్తైన తర్వాతే ఎన్టీఆర్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాడట ప్రశాంత్ నీల్. ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ ‘దేవర 2, యశ్ రాజ్ ఫిల్మ్స్ లో చేసే మరొక చిత్రం, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పార్ట్ 2’ లను కూడా లైన్లో పెట్టాడు.

ప్రభాస్ విషయానికొస్తే.. ఇప్పటికే ‘కల్కి’ షూట్ ను ఫినిష్ చేసిన రెబెల్ స్టార్ ఈ సంవత్సరం చివరి వరకూ ‘రాజా సాబ్’ని పూర్తి చేస్తాడు. మధ్యలోనే మంచు విష్ణు ‘కన్నప్ప’లో కేమియోలోనూ కనువిందు చేస్తాడు. ఆ తర్వాత వరుసగా ‘సలార్ 2, స్పిరిట్, హనురాఘవపూడి’ చిత్రాలను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు ప్రభాస్. ఇంకా.. ‘కల్కి 2’ కూడా లైన్లో ఉంది.

ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి ఏంటనేది? ఫ్యాన్స్ ను బాగా కలవరపెడుతున్న ప్రశ్న. అయితే.. పవన్ నటిస్తున్న సినిమాల్లో ‘ఓజీ’ ఇప్పటికే దాదాపు పూర్తైంది. పవన్ కేవలం ఈ సినిమాకోసం 15 రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుందట. ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘అత్తారింటికి దారేది’ విడుదలైన తేదీనే ‘ఓజీ’ రాబోతుంది.

మరో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఈ ఏడాది చివరి వరకూ షూటింగ్ పూర్తిచేసుకోనుంది. ఆ తర్వాత ‘హరి హర వీరమల్లు’ని తిరగి పట్టాలెక్కించనున్న పవర్ స్టార్ వచ్చే యేడాది ఈ సినిమాని విడుదల చేయడానికి రెడీ చేస్తాడట. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రం.. ‘ఓజీ 2, హరిహర వీరమల్లు 2’ వంటి సినిమాలు పవన్ కిట్టీలో ఉన్నాయి.

Related Posts