వారి కోసం ప్రత్యేకంగా ‘ఫ్యామిలీ స్టార్’ స్పెషల్ షో

వేసవి వచ్చేసింది. ఈ సమ్మర్ సీజన్ లో కూల్ ఎంటర్ టైన్ మెంట్ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికోసమే అన్నట్టు ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ రెడీ అయ్యింది. వేసవి కానుకగా రేపే (ఏప్రిల్ 5) ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు.

తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ను ప్రత్యేకంగా వీక్షించారు నిర్మాత దిల్ రాజు, హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కుటుంబ సభ్యులు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్’ కుటుంబ సమేతంగా చూడదగ్గర పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అవుతుందని.. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీమియర్ చూసిన ఫ్యామిలీస్ చెబుతున్న మాట.

Related Posts