ఎన్టీఆర్ కొత్త బ్రాండ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో పాటు అప్పుడప్పుడూ కొన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా నటిస్తుంటాడు. ఇంతకు ముందు కూడా అనేక వ్యాపార ప్రకటనల్లో కనిపించాడు ఎన్టీఆ. వీటిలో మొబైల్ ఫోన్స్, కూల్ డ్రింగ్స్, మెక్ డోనాల్డ్స్ వంటివి ఉన్నాయి. తాజాగా మరో బ్రాండ్ ఆయన అకౌంట్లోకి వచ్చింది.

సౌత్ ఇండియాలో ప్రముఖ వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ను తీసుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు గ్లోబల్ రేంజ్ లో ఇమేజ్ వచ్చింది.

ఆ ఇమేజ్ తో పాటు ఇలాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు తను అంబాసిడర్ గా మారే అవకాశాలూ వస్తున్నాయి. అయితే అన్నీ కాకుండా ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్. ఆ క్రమంలో వచ్చిన ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ యాడ్ తో అతను అన్ని వర్గాల ప్రజలకూ మరింత దగ్గరవుతాడు అనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా షూటింగ్ లో ఉన్నాడు. శంషాబాద్ వద్ద వేసిన ఓ సెట్ లో భారీ యాక్షన్ ను చిత్రీకరిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ మూవీపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి.

Related Posts