లోకేష్‌ కనకరాజ్ రిటైర్మెంట్ ప్లాన్స్ ..?

అతి తక్కువ సినిమాలతోనే భారీ ఇంపాక్ట్ చూపించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఫస్ట్ మూవీ మా నగరం. సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఈ మూవీతోనే విమర్శకులను మెప్పించిన అతను తర్వాత కార్తీతో చేసిన ఖైదీతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయాడు.

ఖైదీ చూసిన తమిళ్ స్టార్ ఇళయదళపతి విజయ్ వెంటనే ఆఫర్ ఇచ్చాడు. విజయ్ తో మాస్టర్ మూవీ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే లోకేష్‌ కనకరాజ్ కెపాసిటీని క్లియర్ గా చూపించిన సినిమా విక్రమ్. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీతో అతను ఎంత పెద్ద ప్లానింగ్ తోఉన్నాడో అర్థం అవుతుంది. మల్టీవర్స్ ను క్రియేట్ చేసిన అందులో తన హీరోలందరినీ చివర్లో చూపించే ప్రయత్నం చేయబోతున్నాడని తెలుస్తుంది.

విశేషం ఏంటంటే.. లోకేష్ ప్రతి సినిమాలోనూ డైరెక్ట్ గానే డ్రగ్స్ కు సంబంధించిన మేటర్ ఉంటుంది. మరి డ్రగ్స్ పై అతని ఉద్దేశ్యం ఏంటో కానీ.. తన హీరోలంతా డ్రగ్స్ ను అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంటారు. ప్రస్తుతం మళ్లీ విజయ్ తోనే ‘లియో” అనే సినిమా చేస్తున్నాడు లోకేష్‌. ఈ మూవీ అనౌన్స్ మెంట్ తోనే అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 19న విడుదల కాబోతోంది లియో.

ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనేది కోలీవుడ్ టాక్. అటుపై ఖైదీ, విక్రమ్ లకు సీక్వెల్స్ ఉంటాయి. ఈ అందరు హీరోలను కలుపుతూ మరో ప్రాజెక్ట్ కూడా ఉంటుందని సమాచారం. సో.. ఎలా చూసినా ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ఓ కొత్త పేజ్ క్రియేట్ చేసుకోబోతున్నాడు లోకేష్‌ కనకరాజ్. అలాంటి దర్శకుడు రిటైర్మెంట్ ప్లాన్స్ చేసుకుంటున్నాడు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ..? కానీ ఇది నిజం. అతను ఎవరూ ఊహించని విధంగా రిటైర్మెంట్ ప్లానింగ్ లో కూడా ఉన్నాడు.

కొన్నాళ్ల క్రితం తెలుగులో కొరటాల శివ కూడా ఇదే మాట అన్నాడు. వరుసగా పది బ్లాక్ బస్టర్స్ కొట్టిన తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అవుతాను అని. ఇప్పుడు లోకేష్ కూడా ఇదే రూట్ లో వెళ్లబోతున్నాడట. తను కూడా వరుసగా కొన్ని బ్లాక్ బస్టర్స్ కొట్టిన తర్వాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోతాను అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో లోకేష్ రిటైర్మెంట్ వ్యవహారం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఏ దర్శకుడైనా తనకు సాగినంత కాలం, తనకు విజయాలు ఉన్నంత కాలం సినిమాలు చేయాలని అనుకుంటాడు.

అందుకు భిన్నంగా కొరటాల, లోకేష్‌ లాంటి వాళ్లు ఆలోచించడం వెనక ఆంతర్యం ఏంటో కానీ.. ఇలాంటి వాళ్లు రిటైర్ అవడానికి ముందు.. తర్వాత వచ్చే తరానికి ఓ కొత్త ఛాలెంజ్ ను కూడా వదిలి వెళితే ఇంకా బావుంటుందేమో.

Related Posts