తమన్ ను తీసేయలేదు

గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ను తప్పించారు అనే ఒకే ఒక్క మాట సోషల్ మీడియాను షేక్ చేసింది. ట్విట్టర్ లో అయితే ఏకంగా టాప్ ట్రెండింగ్ లో ఉందీ మేటర్. ఓ రకంగా అది తమన్ రేంజ్ గానూ చెప్పుకోవచ్చు. లేదంటే ఓ సంగీత దర్శకుడిని తప్పించారు అనే మాట అంత పెద్ద వైరల్ ఎలా అవుతుంది. యస్.. త్రివిక్రమ్, మహేష్‌ బాబు మూవీ గుంటూరు కారం కు తమన్ ను సంగీత దర్శకుడుగా తీసుకున్నారు.

అయితే లేటెస్ట్ గా అతన్ని తప్పించి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్‌ కుమార్ ను తీసుకున్నారు అనే రూమర్స్ వచ్చాయి. దీంతో అంతా ఇది నిజమే అనుకున్నారు కూడా. పైగా ఈ రూమర్ కు మహేష్‌ బాబు ఫ్యాన్స్ తో కలిపి రాశారు. గుంటూరు కారం గ్లింప్స్ లోని మ్యూజిక్ ఫ్యాన్స్ కు నచ్చలేదని.. అందుకే తమన్ ను తీసేయాలని వాళ్లే డిమాండ్ చేశారు అనే మసాలా కూడా యాడ్ చేశారు. ఫైనల్ గా ఇది కేవలం రూమర్ గానే తేలిపోయింది.

హారిక హాసిన బ్యానర్ లో రూపొందుతోన్న గుంటూరు కారం నుంచి తమన్ ను తీసేయలేదు.. అంటూ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వైజేఆర్ రేటింగ్ ఫేమ్ వైజే రాంబాబు చేసిన ట్వీట్ కు నిర్మాత నాగవంశీ స్పందించాడు. రాంబాబు చెప్పింది నిజమే అంటూ ఎమోజీ యాడ్ చేశారు. దీంతో తమనే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు అనేది తేలిపోయింది.

నిజానికి అరవింద సమేత వీర రాఘవ నుంచి త్రివిక్రమ్ తో పనిచేస్తున్నాడు తమన్. వీరి కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో ఆల్బమ్ దేశం మొత్తాన్ని ఊపేసింది. ఏజ్ తో పనిలేకుండా ప్రతి ఒక్కరూ ఈ మ్యూజిక్ ను ఎంజాయ్ చేశారు.

తమన్ కు అంతకు ముందు మహేష్ బాబుతో దూకుడు, ఆగడు చిత్రాలకు పనిచేశాడు. ఆగడు పోయినా.. దూకుడు బ్లాక్ బస్టర్. పైగా ఇలాంటి వాటిలో మహేష్‌ బాబు పెద్దగా వేలు పెట్టడు. కేవలం సినిమాటోగ్రాఫర్ విషయంలో మాత్రం చూసుకుంటాడు అంతే. మొత్తంగా ఈ గుంటూరు కారం తమన్ ను దాటిపోలేదు అనేది క్లియర్.

Related Posts