ఫ్రైడే సినిమాల సండదేదీ..

శుక్రవారం వస్తోందంటే నాలుగైదు రోజుల ముందు నుంచే నానా హడావిడీ మొదలవుతుంది. పెద్ద సినిమాలే ఇంకా చాలా రోజుల ముందు నుంచే సందడి చేయాల్సి ఉంటుంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా వచ్చిన సినిమాల్లో భోళా శంకర్ మెప్పించలేకపోయింది. బట్ డబ్బింగ్ గా వచ్చిన జైలర్.. రూలర్ లా మారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఇక నెక్ట్స్ వీక్ అయినా టాలీవుడ్ సినిమాలు సందడి చేస్తాయేమో అనుకుంటే ఆ ఊపు ఏమీ కనిపించడం లేదు.

కాన్సెప్ట్ బేస్డ్ గా కనిపిస్తోన్న మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కంటెంట్ కాదు. క్లాస్ కూడా అంత సేపూ ఒక మగవాడు ప్రెగ్నెంట్ అయ్యాడు అంటే భరిస్తారా అంటే డౌటే. పైగా ఇలాంటివి ట్రాకులుగా ఉంటే చూస్తారేమో కానీ.. సినిమాగా మాత్రం చెప్పలేం.


ఇక వరుస డిజాస్టర్స్ తో కెరీరే ప్రశ్నార్థకంలో వేసుకున్న మరో హీరో సంతోష్‌ శోభన్ కూడా ప్రేమ్ కుమార్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీపై ఏ దశలోనూ మినిమం బజ్ కూడా క్రియేట్ కాలేదు. ఎలా చూసినా సంతోష్‌ కొంత వరకూ తెలిసిన హీరోనే. అయినా అతని సినిమా ఒకటుందన్న విషయం ఇండస్ట్రీలో కూడా పెద్దగా తెలియడం లేదు అంటే అతని పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు ప్రభాస్ లాంటి స్టార్ సపోర్ట్ చేసినా.. ఎందుకో స్టోరీ సెలెక్షన్ లో బాగా విఫలమవుతున్నాడు సంతోష్‌. మరి ఈ మూవీ కూడా పోతే.. ఇక అతని కెరీర్ వెబ్ సిరీస్ లకు టర్న్ అవుతుందనుకోవచ్చు. ఇక ఇవి కాక ఇంకా పేర్లు కూడా రిజిస్టర్ కాని సినిమాలు కొన్ని ఉన్నాయి. అంతో ఇంతో తెలిసిన ఈ హీరోల పరిస్థితే ఇలా ఉంటే ఇక వారి గురించి చెప్పకోవడం కూడా వృథానే అవుతుందేమో.

Related Posts