ఈ కన్నడ హీరోయిన్ ది ఎంత పెద్ద మనసో..

ఇండస్ట్రీలో కాస్త గుర్తింపు వస్తేనే కన్నూ మిన్నూ కానకుండా పోతున్నారు ఈ మధ్య కొందరు. అలాంటిది శాండల్ వుడ్ లోనే టాప్ హీరోయిన్ అయిన రచితా రామ్ చేసిన పని గురించి తెలిస్తే ఖచ్చితంగా తన అందమైన వ్యక్తిత్వానికి కూడా హ్యాట్సాఫ్ చెప్పుకుండా ఉండరు. అన్నట్టు ఈ భామ గురించి తెలుగు వారికి పెద్దగా తెలియదు కానీ కన్నడ నాట తనే టాప్ హీరోయిన్.

ఎంత స్టార్డమ్ ఉందో అంత డౌన్ టు ఎర్త్ అని కూడా ప్రతిసారీ తన నడవడిక చూస్తే తెలుస్తుంది. ఇక తాజాగా బెంగళూరులో తను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతోంది. వేదిక వద్దకు వెళ్లగానే చాలామంది జనం ఉన్నారట. ట్రాఫిక్ కూడా బాగా ఉండటంతో డ్రైవర్ కాస్త చూసుకోకుండా తన కార్ ను అక్కడి ఓ వ్యక్తికి తగిలించాడు. అతను కూడా సరిగా చూసుకోకుండా నడుస్తూ రావడంతో ఈ చిన్న ప్రమాదం జరిగిందట. బట్ అప్పుడు ఎవరూ చూడలేద. పట్టించుకోలేదు. తను ఆ టైమ్ ఫోన్ చూస్తుండటంతో జరిగిన విషయం డ్రైవర్ చెబితె తెలుసుకుని.. ముందు ప్రోగ్రామ్ ను పూర్తి చేసుకుందట. అంతమంది మీడియావాళ్లు ఉన్నా ఈ విషయం తనకు ఎవరూ చెప్పలేదు అనడం కొసమెరుపు.


ఇక తన కార్ వల్ల ప్రమాదానాకి గురైన వ్యక్తిని స్వయంగా కనిపెట్టి ఇంటికి పిలిపించుకుంది. అతనితో కాసేపు మాట్లాడింది. తీరా చూస్తే అతనో తెలుగు వ్యక్తి. అయినా అన్నా.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పు.. మనమందరం భారతీయులం. అనగానే అతను తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పాడు. తన డ్రైవర్ చేసిన పొరబాటుకు తను క్షమాపణలు చెబుతున్నా అంటూ అతని చేతులు పట్టుకుని అడగటం చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. నిజానికి ఆ వ్యక్తికి అసలు గాయాలు కాలేదు. కార్ మెల్లగానే తాకినా కింద పడిపోయాడట. అయినా సరే తను రచితా రామ్ ఇంత చొరవ తీసుకుని పబ్లిక్ కు తెలిసేలా క్షమాపణలు చెప్పడం.. తన డ్రైవర్ కూడా ఓ కార్మికుడే కాబట్టి అతన్నీ క్షమించమని చెప్పడం చూస్తే తను పెద్ద హీరోయిన్ మాత్రమే కాదు.. పెద్ద మనసున్న మనిషి అని కూడా అర్థం అవుతుంది.


ఇక ఆ వ్యక్తికి ఆమె ఆర్థిక సాయం కూడా చేసింది. కానీ అది వీడియో రికార్డ్ చేయలేదు. ఇది చాలు.. తన వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలియడానికి. పెద్ద పెద్ద ప్రమాదాలు చేసి కూడా పట్టించుకోకుండా పోతున్న ఈ కాలంలో తను ఇలా చేయడం చూసి నెటిజన్స్ అంతా హ్యాట్సాఫ్ రచితా రామ్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Related Posts