బాధ్యత పెరిగిందంటున్న తమ్ముడు

నితిన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఇది ఆల్రెడీ తెలిసిందే. కాకపోతే అఫీషియల్ గా ఓపెనింగ్ జరుపుకుంది. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయబోతోన్న సినిమా ఇది. వకీల్ సాబ్ తర్వాత వేణు చేస్తోన్న సినిమా ఇదే. ముందు నుంచీ అతను దిల్ రాజు క్యాంప్ కు చాలా దగ్గరగానే ఉంటున్నాడు.

అందుకే ఆయనే మరో అవకాశం ఇచ్చాడు. ఇక ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ ను పెట్టారు. ” తమ్ముడు” అనేదే టైటిల్. ఇది అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో సాగే సినిమా అని గతంలోనూ వార్తలు వచ్చాయి. అది నిజమే అని ఈ టైటిల్ చెబుతోంది.

ఇక ఈ టైటిల్ వల్ల తన బాధ్యత మరింత పెరిగిందంటున్నాడు నితిన్. తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ. అప్పట్లో చాలా మందిని ఇన్ స్పైర్ చేసింది కూడా. అందుకే ఈ టైటిల్ అంటే తనకు బాధ్యత అంటున్నాడు నితిన్.


ఇక వేణు శ్రీరామ్ ఇదే బ్యానర్ లో గతంలో చేసిన ఎమ్.సి.ఏ లోనూ ఒదిన మరిది నేపథ్యంలో ఉండే కథ. ఈ సారి సిస్టర్ సెంటిమెంట్ అంటున్నాడు. అయితే ఈ అనౌన్స్ మెంట్ తో పాటు చెప్పిన ఒక మాట చూస్తే ఈ అక్క తమ్ముడు రక్త సంబంధం ఉన్నవాళ్లు కాదు అనిపిస్తోంది. బంధం రక్తం కంటే బలమైనది అనే మాట వాడారు.

అంటే రక్త సంబంధం లేకపోయినా కొన్ని బంధాలు అంతకు మించిన అనుబంధంతో ఉంటాయని చెప్పడం అనిపిస్తోంది. మరి ఈ తమ్ముడు అందరు అక్కలకు అండగా ఉంటాడేమో కానీ చాలా రోజుల తర్వాత నితిన్ కు టైటిల్ వినగానే ఓ పాజిటివ్ వైబ్ కలిగించే సినిమా పడిందంటున్నారు టీ టౌన్ పీపుల్

Related Posts