‘జై హనుమాన్’ బాగా ఆలస్యమవ్వనుందా?

‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ సాధించడంతో సీక్వెల్ ‘జై హనుమాన్’పై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాని 2025 లోనే విడుదల చేస్తామని.. తొలి భాగం చివరిలో ప్రకటించారు. అయితే.. ప్రస్తుతం ప్రశాంత్ వర్మకి ఉన్న కమిట్‌మెంట్స్ చూస్తుంటే.. ‘జై హనుమాన్’ 2025లో రావడం కష్టమే అని వినిపిస్తుంది.

‘హనుమాన్’తో పాటు ప్రశాంత్ వర్మ.. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ‘అక్టోపస్’ అనే సినిమాని మొదలుపెట్టాడు. ఈ చిత్రం సగభాగం వరకూ చిత్రీకరణ పూర్తిచేసుకుందట. దీంతో పాటు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈకోవలో.. అనుపమ పరమేశ్వరన్, రణ్‌వీర్ సింగ్ చిత్రాల తర్వాతే ‘జై హనుమాన్’ మొదలుపెడతాడనే ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా.. తన మూవీస్ ఆర్డర్ పై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Related Posts