ఓ.జి టీజర్ ఎప్పుడు.. ఎలా ఉండబోతోంది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజి టీజర్ కు ముహూర్తం సెట్ అయింది. సుజీత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడని అందరికీ తెలుసు. ఓజి అంటేనే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం అన్నారు కదా. ఈ చిత్రంలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ నటిస్తుండగా ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ కనిపించబోతున్నారు. ఇంతకు ముందు పవన్ .. బాలు, పంజా చిత్రాల్లో కూడా గ్యాంగ్ స్టర్ తరహా పాత్రల్లో కనిపించాడు. ఆ రెండూ కమర్షియల్ గా ఆకట్టుకోలేదు. అయితే ఓజి అలా కాదు అని ముందు నుంచీ అంచనాలు పెంచుతూ వస్తున్నారు.

ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా అదే రోజు సాయంత్రం ఓ.జి టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ తోనే సనిమాపై ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా చేయబోతున్నాడట సుజిత్. ఫ్యాన్స్ మాత్రమే కాక.. పవన్ సినిమా ఎలా ఉంటే బాక్సాఫీస్ షేక్ అవుతుందో ఆ రేంజ్ లో టీజర్ కట్ చేశారని టాక్. గతంలో సుజిత్ చేసిన సాహో టీజర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతకు మించి ఈ టీజర్ ఉంటుందట. ఆ రేంజ్ చూపిస్తేనే ఫ్యాన్స్ కు కూడా కొత్త ఊపు వస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన పవన్ కళ్యాణ్ అక్టోబర్ లో 20 రోజులు, నవంబర్ లో వారం రోజులు డేట్స్ ఇచ్చి ఉన్నాడు. ఇటు సెప్టెంబర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అయితే ఉస్తాద్ నుంచి కూడా ఓ కొత్త పోస్టర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా పవన్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు ఈ రెండు సినిమాల నుంచి కిరాక్ అప్డేట్స్ రావడం మాత్రం ఖాయం.

Related Posts