నితిన్ సినిమా ఆగిపోలేదట

కొన్నాళ్లుగా ఓ సాలిడ్ హిట్ కోసం చకోర పక్షిలా చూస్తున్నాడు నితిన్. నిజానికి నితిన్ కెరీర్ ఎప్పుడూ నిలకడగా లేదు. ఒక హిట్ పడితే వరుస ఫ్లాపులు రావడం కామన్ గానే చూస్తున్నాం. చివరగా వచ్చిన మాచర్ల నియోజకవర్గంపై అతను చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

కానీ దారుణమైన ఫ్లాప్ గా నిలించిందీ సినిమా. దీంతో నెక్ట్స్ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. తనకు గతంలో భీష్మతో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేశారు.

రష్మిక మందన్నా హీరోయిన్ గా మొదలైన ఈ సినిమా నుంచి తను రీసెంట్ గా తప్పుకుంది. ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం చూస్తున్నారు. అయితే ఈ మూవీతో పాటు రచయిత నుంచి దర్శకుడుగా మారిన వక్కంతం వంశీ సినిమా కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనుకున్నారు చాలామంది. కానీ ఆగిపోలేదట.


నితిన్ – వక్కంతం వంశీ కాంబోలోరూపొందుతోన్న ఈ మూవీపై ఓ సర్ ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 60శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. ఈ 60శాతంలోనే ఫస్ట్ హాఫ్‌ కూడా పూర్తయిందని చెప్పాడు వంశీ. ప్రస్తుతం హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లోని మోకిలాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోందట. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ మూవీలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తుండటం విశేషం. ఈ క్రమంలో అతను అనేక గెటప్స్ లో కనిపిస్తాడట. ఆ గెటప్స్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఓ టాప్ సీక్రెట్ కూడా ఉంటుందని టాక్. మొత్తంగా అసలు ఇప్పటి వరకూ ఏ ఊసూ లేకపోతే ఈ సినిమా ఆగిపోయిందేమో అనుకున్న వారికి మంచి అప్డేట్ చెప్పాడు వక్కంతం వంశీ. ఇక ఈ మిగతా షూటింగ్ కూడా సెప్టెంబర్ వరకూ పూర్తి చేస్తారట. చూస్తోంటే ఈ మూవీ వచ్చే యేడాది ఆరంభంలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Related Posts