సలార్.. సంచలన రికార్డ్

సలార్.. ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. రాబోయే మూడు నాలుగు నెలల కాలంలో వచ్చేవన్నీ ప్యాన్ ఇండియన్ సినిమాలే. అయినా వీటిలో స్పెషల్ గా కనిపిస్తోన్న సినిమా సలార్. కారణం.. ఇది ఇప్పటికే ప్యాన్ ఇండియన్ రేంజ్ లో తిరగులేని స్టార్డమ్ తెచ్చుకున్న ప్రభాస్, కేజీఎఫ్ రెండు చాప్టర్స్ తో దేశాన్ని ఊపేసిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తుండటమే.

ఈ కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచీ ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోది. రీసెంట్ గా వచ్చిన టీజర్ కాస్త డిజప్పాయింట్ చేసినా.. ఆగస్ట్ లో వచ్చే ట్రైలర్ హై మూమెంట్ తెస్తుందనే నమ్మకంతో ఉన్నారు. బట్ ట్రైలర్ కూడా రాకముందే ఈ చిత్రం ఓ సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ.. ఓ ప్రామినెంట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఈ చిత్రానికి రికార్డ్ ధర చెల్లింది ఓటిటి రైట్స్ తీసుకుంది.


నిజానికి బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ పూర్తిగా నిరాశపరిచాయి. ముఖ్యంగా ఆదిపురుష్‌ దారుణంగా పోయింది. అయినా ఈ క్రేజ్ ఉందంటే కారణం ప్రభాస్ కటౌట్ అని మాత్రమే చెప్పాలి. లేదంటే వరుసగా మూడుఫ్లాపులుంటే ఎంత ప్యాన్ ఇండియన్ స్టార్ అయినా క్రేజ్ తగ్గుతుంది.

ఫ్యాన్స్ లో కాకపోయినా బిజినెస్ లో తగ్గుతుంది. బట్ ప్రభాస్ సలార్ ఓటిటి రైట్స్ 200 కోట్లకు అమ్మేశారు. అదీ ఆ కటౌట్‌ కు ఉన్న కెపాసిటీ. యస్.. ఈ మూవీ ఓటిటి రైట్స్ నే 200 కోట్లకు అమ్మేశారట. ఇంకా శాటిలైట్ రైట్స్ వేరే ఉన్నాయి. అంటే నాన్ థియేట్రికల్ ఫిగర్స్ తోనే బడ్జెట్ రికవర్ అవుతుందని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ గత సినిమా కేజీఎఫ్ ను కూడా 100 కోట్లకు డిజిటల్ రైట్స్ ను ఇచ్చారు. అందులోనే ఓటిటి, శాటిలైట్ కూడా ఉంది.

బట్ సలార్ కు కేవలం ఓటిటి రైట్స్ నే 200 కోట్లు. మొత్తంగా ఇదో రికార్డ్ అనే చెప్పాలి. అఫ్‌ కోర్స్ ఇంత కంటే ఎక్కువగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకు రేట్ పెట్టారు. అయినా అతను పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాతే ఆ రేట్ లోకి, రేంజ్ లోకి వచ్చాడు. మరి ప్రభాస్.. వరుసగా మూడు ఫ్లాపులున్నా.. ఈ క్రేజ్ ఉంది. మరి సలార్ ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతుందో త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.

Related Posts