పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కు ఓ ఎమోషన్. పవన్ కళ్యాణ్ రాజకీయాలు కూడా వారికి ఓ ఎమోషనే.అందుకే రాజకీయాల్లో ఏం చేయలేక.. సినిమాలు వచ్చినప్పుడు ఆ ఎమోషన్ తో ఆడుకుంటాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ దగ్గర నుంచి ఇబ్బంది పెట్టడం మొదదలుపెట్టేవాడు.
ఇతర పెద్ద సినిమాలకు రేట్ లు పెంచుకోమనిచెప్పినా.. పవన్ కు ఆ వెసులుబాటు ఇవ్వడు. పైగాఆ మధ్య పవన్ సినిమా రిలీజ్ టైమ్ లోనే టికెట్ రేట్లు దారుణంగా తగ్గించి.. ఇండస్ట్రీనేఓ ఆట ఆడుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ జగన్ ను మరింత ఘాటుగా టార్గెట్ చేశాడు.
వారాహి విజయయాత్ర పేరుతో మొదలుపెట్టిన యాత్రలో రోజుకో రకంగా జగన్ ను, ఆయన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు. మరి లైట్ గా ఉన్నప్పుడే అతన్ని వేధించిన జగన్ ఈ సారి వదులుతాడా..? అందుకే ఈ నెల 28న విడుదల కాబోతోన్న బ్రో చిత్రానికి మరింత సమస్యలు తప్పవు అంటున్నారు.
ఈ సారి ఈ సినిమా మేకర్స్ కు మరింత టార్చర్ పెడతాడు జగన్ అనేది అంతా ఊహిస్తున్న అంశం. మామూలుగా సినిమాల విడుదల విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవు. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి.. తప్ప పెంచవు. తెలంగాణలో అయినా టాలీవుడ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది. ఆంధ్రలో అలా కాదుగా.. అందుకే ఈ బ్రో చిత్రానికి థియేటర్స్ దగ్గర నుంచి ఇతర అంశాల వరకూ అనేక సమస్యలు సృష్టించడం ఖాయం అంటున్నారు.
ఈ మేరకు పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిది. అదే టైమ్ లో కాస్త జాగ్రత్తగానూ ఉండాలి. అనవసరమైన హంగామా చేస్తే లేనిపోని కేస్ లు కూడా బనాయించే అవకాశం ఉంది. సో.. ఈ సారి జగన్ ఇంకాస్త స్ట్రాంగ్ గానే బ్రో సినిమాపై ఫోకస్ పెడతాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.