నాని మాస్ ర్యాంపేజ్ తో ‘సరిపోదా శనివారం‘ గ్లిమ్స్

ఈరోజు (ఫిబ్రవరి 24) శనివారం.. పైగా నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా.. నాని మోస్ట్ అవైటింగ్ మూవీ ‘సరిపోదా శనివారం‘ నుంచి స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది టీమ్. ‘కోపాలు రకరకాలు.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది. కానీ.. ఆ కోపాన్ని క్రమబద్ధంగా.. పద్ధతిగా.. వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకును‘ చూశారా అంటూ ఈ సినిమాలో సూర్య పాత్రలో కనిపించే నాని ఇంట్రోని వింటేనే.. ఈ మూవీలో నాని క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది.

ఇప్పటివరకూ ఎక్కువగా ఫ్యామిలీ, రొమాంటిక్ మూవీస్ లో నటించిన నాని.. ఈసారి ఫక్తు మాస్ అవతార్ లో మురిపించబోతున్న మూవీ ‘సరిపోదా శనివారం‘. ‘అంటే.. సుందరానికి‘ చిత్రం తర్వాత నానితో వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా.. ఎస్.జె.సూర్య పోలీసాఫీసర్ పాత్రలో విలనిజాన్ని పండించబోతున్నాడు. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘సరిపోదా శనివారం‘ ఈ ఏడాది ఆగస్టు 29న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts