‘గామి‘ నుంచి పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్

గమ్యాన్నే చేధించే స్థైర్యంతో పదా.. ధైర్యాన్నే సంధించే వచ్చిందో ఆపద‘ అంటూ విశ్వక్ సేన్ విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్న ‘గామి‘ నుంచి పవర్ ఫుల్ సాంగ్ వచ్చింది. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలతో ‘గామి‘పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎక్కువగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో అలరించే విశ్వక్ సేన్.. తొలిసారి ఓ అఘోరా పాత్రలో కనిపించబోతున్న చిత్రమిది.

తాజాగా ‘గామి‘ నుంచి ‘గమ్యాన్నే.. ది క్వెస్ట్‘ సాంగ్ అంటూ విడుదలైన ఈ గీతాన్ని స్వీకర్ అగస్తీ స్వరకల్పనలో సనాపతి భరద్వాజ పాత్రుడు రాయగా.. అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తీ, సుగుణమ్మ అద్భుతంగా ఆలపించారు. రియల్ లొకేషన్స్ లో అఘోరా గెటప్ లో విశ్వక్ సేన్ అదరగొట్టబోతున్న ఈ పాట సిల్వర్ స్క్రీన్ పై ఓ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పాటలో హీరోయిన్ చాందిని చౌదరి కూడా కనిపించబోతుంది. విద్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాని కార్తీక్ శబరీష్ నిర్మిస్తుండగా.. .వి.క్రియేషన్స్ విడుదల చేస్తుంది. మార్చి 8న ‘గామి’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts