‘విశ్వంభర‘ కోసం ‘హిట్లర్‘ ఫార్ములా

జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి‘ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లాడు మెగాస్టార్ చిరంజీవి. మళ్లీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘విశ్వంభర‘తో మళ్లీ అలాంటి జోనర్ లో మురిపించడానికి ముస్తాబవుతున్నాడు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొనకపోయినా.. ఆ తర్వాత చిరంజీవి కూడా సెట్స్ లో అడుగుపెట్టాడు. హీరోయిన్ గా చెన్నై సోయగం త్రిషను ఎంపిక చేశారు.

ముల్లోకాలకు సంబంధించిన కథ కావడంతో ఈ చిత్రంలో ఐదారుగురు హీరోయిన్లు ఉంటారనే ప్రచారం ఆమధ్య జోరుగా సాగింది. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్లు కాదు.. చిరంజీవి చెల్లెళ్లు పాత్రలే ఎక్కువ ఉంటాయనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోన్న న్యూస్. ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబు అనే పాత్రలో కనిపించబోతున్నాడట. చిరంజీవి పాత్రలో విభిన్నమైన షేడ్స్ ఉంటాయట. ఫన్నీగా ఉంటూనే ఎంతో రెస్పాన్సిబుల్ గానూ ఉంటుందట. ఒకవిధంగా చెప్పాలంటే చిరు ‘హిట్లర్‘ ఫార్ములానే ‘విశ్వంభర‘కి ఫాలో అవుతున్నాడట డైరెక్టర్ వశిష్ట.

‘హిట్లర్‘ చిత్రంలో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు ఉంటారు. ఒక మాస్ హీరోగా పీక్స్ లో ఉన్న మెగాస్టార్.. ఈ మూవీలో పండించిన సిస్టర్ సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘విశ్వంభర‘లో అలాంటి సిస్టర్ సెంటిమెంట్ హైలైట్ కానుందట. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెళ్లు పాత్రల్లో సురభి, ఆషిక రంగనాథ్ వంటి వారు నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సురభి ‘విశ్వంభర‘ సెట్స్ లోకి కూడా అడుగుపెట్టిందట. త్వరలోనే.. ‘విశ్వంభర‘లో చిరంజీవి చెల్లెళ్లు పాత్రల్లో నటించే నటీమణులెవరనేది తెలిసే అవకాశం ఉంది.

Related Posts