ప్రభాస్ తో నా సినిమా మామూలుగా ఉండదు

ఇది ఊహించని డైలాగ్. అంత కాదు.. నెక్ట్స్ స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుందని చెబుతున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఏంటీ కరెక్ట్ గానే చూశామా అనుకుంటున్నారా.. ? యస్.. ప్రభాస్ తో నా సినిమా మామూలుగా ఉండదు.. అని చెప్పింది ఇంకెవరో కాదు.. లోకేష్ కనకరాజ్. మనోడు చాలా తక్కువ సినిమాలతోనే టాప్ డైరెక్టర్ అయిపోయాడు. అదొక్కటే కాదు.

సరికొత్త కంటెంట్స్ చూపిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఇండియాలో లేని మల్టీవర్స్ క్రియేట్ చేస్తున్నాడు. మా నగరం అనే చిన్న సినిమాతో మెప్పించి.. తర్వాత ఖైదీ, మాస్టర్, విక్రమ్ అంటూ వీర విహారం చేస్తున్నాడు. అలాంటి దర్శకుడు ప్రభాస్ తో సినిమా చేస్తే ఇంక ఫ్యాన్స్ లో ఎలాంటి కిక్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి లోకేష్ ఓ మాట చెబుతున్నాడు. ప్రభాస్ తో సినిమా చేస్తే.. అది తమ కెరీర్స్ లోనే ది బెస్ట్ గా ఉండాలట.

అలాంటి స్క్రిప్ట్ లాక్ అయిన వెంటనే అనౌన్స్ చేస్తా అంటున్నాడు. ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ తో లియో అనే మూవీ చేస్తున్నాడు లోకేష్. ఈ చిత్రం ఈ యేడాది దసరాకు విడుదలవుతుంది. ఆ తర్వాత ప్రభాస్ తో మూవీకి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తా అని రీసెంట్ గా ఓ తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.


నిజానికి లోకేష్‌ నెక్ట్స్ మూవీ ఖైదీకి సీక్వెల్ గా ఉంటుంది. లేదంటే విక్రమ్ కు సీక్వెల్ గా ఉంటుందనే టాక్స్ ఉన్నాయి. అవి కాదని ప్రభాస్ తో ప్రాజెక్ట్ గురించి చెప్పాడు అంటే ఆల్రెడీ ఈ ఇద్దరి మధ్య ఓ మీటింగ్ జరిగిందా అనిపిస్తోంది కదూ.. అయితే లోకేష్ అనుకున్న వెంటనే కూడా ఈ ప్రాజెక్ట్ కాదు. ప్రభాస్ లైనప్ ఆ రేంజ్ లో ఉంది మరి. ప్రస్తుతం సలార్ కు చివరి దశలో ఉంది.

ప్రాజెక్ట్ కే ఈ యేడాది అయిపోతుంది. తర్వాత మారుతితో రాజా డీలక్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. అటుపై సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే మూవీ ఆల్రెడీ అనౌన్స్ అయి ఉంది. సో.. 2024 మొత్తం ప్రభాస్ ఖాళీగా ఉండడు. అలాంటప్పుడు ఈ కాంబోలో సినిమా ఎర్లీగా ఎక్స్ పెక్ట్ చేయడం అత్యాశే అవుతుంది. బట్ ఒకవేళ లోకేష్‌ కనకరాజ్ అల్టిమేట్ స్టోరీ చెప్పి.. ప్రభాస్ ను ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేస్తే కనుక వెంటనే ఉన్నా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా ఈ కాంబోలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పడితే.. ఆ మూవీలో ప్రభాస్ కూడా ఓ పే.. ద్ద గన్ పట్టుకుని విలన్స్ ను కాల్చిపడేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండోసారి..

Related Posts