ప్రభాస్ తో రొమాన్స్ చేయబోతున్న మృణాల్

తెలుగులో మరో అందమైన కాంబినేషన్ సెట్ అయ్యే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రెబెల్ స్టార్ ప్రభాస్, మెస్మరైజింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కాంబోలో సినిమా సెట్ అయ్యిందనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్న టాక్. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తుంపు.. తెలుగు సినిమా ‘సీతారామం‘తో దక్కించుకుంది మృణాల్. ఈ పీరియాడ్ మూవీలో సీతగా సినీ ప్రేమికుల మదిలో చెరగని ముద్ర వేసింది.

ఆ తర్వాత ‘హాయ్ నాన్న‘తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మృణాల్.. ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’తో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతుంది. పనిలో పనిగా ఇప్పుడు రెబెల్ స్టార్ ప్రభాస్ తోనూ నటించే అరుదైన ఆఫర్ అందుకుందట. ప్రభాస్ తో విలక్షణ దర్శకుడు హను రాఘవిపూడి ఓ సినిమా చేయబోతున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో పీరియడ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ మూవీకోసం ఇటీవల గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగినట్టు ప్రచారమైంది.

సీతారామం‘ తర్వాత చేయబోతున్న ఈ సినిమాకోసం.. చాలామంది టెక్నీషియన్స్ ను రిపీట్ చేయబోతున్నాడు హను రాఘవపూడి. అందులో భాగంగానే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ను ప్రభాస్ సినిమాకోసం తీసుకున్నాడట. ఇప్పుడు ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ను కూడా ప్రభాస్ కి జోడీగా సెట్ చేశాడట. త్వరలోనే అనౌన్స్ మెంట్ తో రానున్న ప్రభాస్-హను రాఘవపూడి మూవీలో హీరోయిన్ గా మృణాల్ పేరును కూడా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. ఆన్ స్క్రీన్ పై రెబెల్ స్టార్ ప్రభాస్ తో మెస్మరైజింగ్ బ్యూటీ మృణాల్ జోడీ కడితే అదెంత అందంగా ఉంటుందో తెరపై చూసి తీరాల్సిందే.

Related Posts