రహస్యతో కిరణ్ రహస్య ప్రేమ.. పెళ్లి ఫిక్సైంది

ఈమధ్య చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు పెరుగుతున్నాయి. తమ తోటి నటీమణులతోనే ప్రేమలో పడుతున్నారు మన హీరోలు. ఈలిస్టులో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా చేరాడనే న్యూస్ కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. కిరణ్ తొలి చిత్రం ‘రాజా వారు రాణి గారు’ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో కిరణ్ కి జోడీగా రహస్య గోరఖ్ నటించింది. ఈ సినిమా టైటిల్ లానే ఈ అమ్మాయి కూడా చూడడానికి అచ్చు రాణి లాగే కనిపిస్తుంది. అందుకేనేమో మన రాజా వారు కిరణ్.. రాణి రహస్య ని ఎంతో రహస్యంగా ప్రేమించాడట.

ఇప్పటివరకూ ఎన్నిసార్లు అడిగినా.. తమ ప్రేమ గురించి దాచిపెడుతూనే ఉన్నారు ఈ వీరిద్దరూ. అయితే.. అప్పట్లో వీరిద్దరూ ఓ వెకేషన్ కి వెళ్లడం.. ఒకే లొకేషన్ లో ఒకేసారి విడివిడిగా దిగిన ఫోటోలను పోస్ట్ చేయడం.. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం గృహ ప్రవేశంలో రహస్య కనిపించడం వంటివి వీరి మధ్య ప్రేమకు బలం చేకూర్చాయి. మొత్తానికి కిరణ్ అబ్బవరం రహస్యను పెళ్లి చేసుకోబోతున్నాడు. కిరణ్ అబ్బవరం, రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుని, రిలేషన్ షిప్ లో ఉంటున్నారు.

ఈ నెల 17న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఆపై మంచి ముహూర్తాన్ని చూసుకుని పెళ్లి చేసుకుంటారట.

Related Posts