‘ఫ్యామిలీ స్టార్’ నుంచి రాబోతున్న రెండో పాట

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. టాలీవుడ్ లక్కీ ఛార్మ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ తో పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈసారి వీరిద్దరి కాంబోని సెట్ చేసింది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఏప్రిల్ 5న సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘ఫ్యామిలీ స్టార్’ ప్రచారంలో వేగం పెంచింది చిత్రబృందం.

ఇప్పటికే ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్, టీజర్, ‘నందనందనా‘ పాటలకు మంచి స్పందన లభించింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ అంటూ సాగే గీతం రేపు (మార్చి 12) విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాట వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ పై చిత్రీకరించిన బ్యూటిఫుల్ డ్యూయెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts