అనిల్ రావిపూడితో మెగాస్టార్

ఏ ఇండస్ట్రీలో అయినా డిఫరెంట్ కాంబినేషన్స్ అనౌన్స్ అయినప్పుడు అందరూ ఆసక్తిగానే చూస్తారు. ప్రస్తుతం అలాంటి కాంబినేషన్స్ బాగా సెట్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో సీనియర్ హీరోలు మీడియం రేంజ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అందుకే మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ అందుకోగలిగాడు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక అనిల్ రావిపూడి ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి మూవీ చేస్తున్నాడు. ఈ ఇద్దరి ఇమేజ్ లు భిన్నమైనవి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

ఇక నెక్ట్స్ అనిల్ రావిపూడి మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి మంచి ఎంటర్టైనింగ్ డైలాగ్స్, కామెడీ డైలాగ్స్ రాయడంలో అనిల్ రావిపూడి ఎక్స్ పర్ట్. అలాంటి డైలాగ్స్ ను కామెడీ టైమింగ్ లో తిరుగులేదు అనిపించుకున్న మెగాస్టార్ పలికితే ఓ రేంజ్ లో పేల్తాయి అని చెప్పాలి.

ప్రస్తుతం మెగాస్టార్ వరుసగా రెండు సినిమాలు సెట్ చేసుకున్నాడు. చిరు 156 అనే చిత్రాన్ని ఆయన కూతురు నిర్మిస్తోంది. దర్శకుడుగా కళ్యాణ్‌ కృష్ణను అనుకుంటున్నారు కానీ అనౌన్స్ చేయలేదు. ఇక 157వ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఆ తర్వాత158వ చిత్రాన్ని అనిల్ రావిపూడే డైరెక్ట్ చేస్తాడని టాక్. చిరంజీవి చాలా దూకుడుగా సినిమాలు చేస్తున్నాడు. వయస్సును కూడా పట్టించుకోకుండా.. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లోనూ పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

అందుకే ఈ రెండు సినిమాలూ వచ్చే యేడాది సమ్మర్ వరకూ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత అనిల్ సినిమా ఉంటుందంటున్నారు. అనిల్ రావిపూడి కూడా ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించి ఓ మంచి లైన్ అనుకున్నాడట. ఆ లైన్ మెగాస్టార్ కు నచ్చితే ఫుల్ స్క్రీప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారని టాక్.

Related Posts